Saturday, December 29, 2012

మమ్మల్ని క్షమించమ్మా, మేము ఆ విషయం లో "మగవాళ్లం" కాదు.



 అని బారత దేశం లోని నాయకులు "అమానత్" కి శ్రద్దాంజలి ఘటీంచాలి. మనం "రేప్" లు చెయ్యడం లో ఫస్ట్ అట! కాని   రేప్ కు గురైన వారికి వైద్య సహాయం లో అండించడమ్ లో "మగవాళ్లం" కాదు అని నిరూపించుకున్నాం. పదిరోజులు బాదితురాలికి వైద్యం ఆందించి, అన్ని అవయవాలు ఇన్ఫెక్షన్ తో పాడయ్యే దాక చూసి, చివరి క్షణం లో "సింగపూర్" పంపుతారా? మన దేశం కంటే ఎంతో చిన్నదయినా దేశం లో ఉన్న మెరుగఈన వైద్య సౌకర్యాలు మన దగ్గర లేనందుకు సిగ్గు పడాలి.
                                                                   
   డీల్లీ రేప్  కేస్ విషయం లో అక్కడి మహిళా ముక్య మంత్రి షీలా దీక్షిత్ గారికి డీల్లీ పోలిసులకు మద్య ఎందుకో బేదాభి ప్రాయాలు ఉన్నట్లు అనిపిస్తున్నాయి. పాలనా పరంగా డిల్లీ పోలిస్ భారత రక్శణ శాఖా మంత్రి షిండే గారి కంట్రోల్  లో పని చేస్తుందట. అందుకే వారికి ముఖ్యమంత్రి ని పెద్దగా పట్టించుకోరనుకుంటా!

  మొన్న  ప్రజలు ఆందొళన  చేసిన విషయమ్ లో, బాదితురాలి మరణ వాంగ్మూలం తీసుకునే సమయం లో పోలిసులు ప్రవర్తించిన తీరు మీద సాక్షాతు, రాష్ట్ర ముఖ్య మంత్రియే పొలిసుల మిద హోమ్ మంత్రికి పిర్యాదు చేసారంటే  పరిస్తితి ఎంత దారుణం గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 మరి అటువంటి పాలనా వ్యవస్తలొ స్త్రీల మీద అత్యాచారాలు చెయ్యాలనుకున్న దుండగలకు ఏ మాత్రం భయం ఉంటుంది చెప్పండి. ప్రతి వాడు తమ మీదకు రాకుండా బాద్యతను ప్రక్క వాడి మీదకు నెడదామని చూసే వారే. ఇటువంటి అదికారులు స్త్రీలకు రక్షణ కల్పించ గలరా? వీరీ రక్షణా  బరోసాను నమ్మి భయటకు వెళ్లిన స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రాగలరా? రాలెరని "అమానత్" ఉదంతమే చెపుతుంది. ఏన్ని కటిన చట్టాలు చేసినా అమలు చేసే వారికి చిత్తశుద్ది లెకపోతే వాటి వల్ల ఒరిగేది ఏమి  ఉండదు.

  కాబట్టి మహిళలు కళ్ళు తెరిచి ప్రస్తుత పరిస్తితులను వాస్తవ ద్రుష్టి తో అంచనా వేసుకో గలగాలి. ఏ పద్దతి అవలంబిస్తే మాన ప్రాణాలకు భద్రత ఉంటుందో వివేకం తో ఆలోచించ గలగాలి. ఒంటరిగా, లేక బాయ్ ఫ్రెండ్లతో తిరగటానికి బదులు ఒక బాచ్ గా అంటే గుంపుగా తిరగటం మేలు.బాయ్ ఫ్రెండ్ ల సంస్క్రుతికి సాద్య మైనంత దూరంగా ఉంటూ,సోదర సోదరీ బావాల సంస్క్రుతిని అలవాటు చెసుకోవటం మేలు. అలాంటి ఫీలింగ్స్ ఉన్న వారితోనే గుంపుగా కలసి తిరగడం మంచిది.

  కీకారణ్యమ్ కంటే జనార్యాణాలోనే స్త్రీలకు రక్షణ కరువు.మగాళ్ల రూపం లో ఉనా తోడేళ్లు నుండి రక్షించుకోవడానికి గిరిజనులు అనుసరించే "గుంపు" జీవన విదానమె కరెక్ట్. వారిలో అంతే. ఒక గుంపులో ఎవరికి హాని తల పెట్టినా మొత్తమ్ గుంపు హాని చెసిన వారి మీద దాడి చేస్తుంది. ఆ భయంతో నే సాదారణంగా ఎవరూ ఒకరి కొకరూ హని తల పెట్టరు . ఎందుకంటే దాని ప్రబావమ్ మొత్తం గుంపు అనుభవించాలి కాబట్టి. అందుకే అక్కడ పోలిస్ లు లేక పొయి..  నా రక్షణ ఉంటుంది. ఈ విదానమె నగరాలలో పాటిస్తే బాగుంటుంది అని నా అబిప్రాయం.
        డీల్లీ    రెప్ కేసు లో బాదితురాలు అమానత్ ఈ రోజు మ్రుతి చెందినది అని తెలిసి చాలా విచారిస్తున్నాను. అమె కొరిక నెరస్తులకు శిక్ష పడటం అని తెలుస్తుమ్ది. కాబట్టి ఆమే ఆత్మకు శాంతి కలగాలంటే తక్షణమె నేరస్తులకు  ఉరి సిక్ష పదేలా ప్రభుత్వమ్ చర్యలు తీసుకోవాలి.ఆమే కుటూంభ సభ్యులకు ప్రగాడ సానుబూతి తెలుపుతూ

2 comments: