ఆంద్ర ప్రదేశ్ లోని రాజకీయ పార్టీల కోసమైనా రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేస్తే బాగుంటుంది కదా అని ఆ లోచిస్తున్నారట కొంతమంది ప్రాంతీయ పార్టీల నాయకులు!. ఇన్నాళ్ళు అంటే తెలుగు జాతికి ఒకే రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో నే ప్రాంతీయ పపార్టీలుగా ఉంటూ తెలుగు ప్రజలు అందరికి సేవ చేసే బాగ్యం దక్కినందుకు పొంగిపోతూ ఉండేవారు . ఇప్పుడు హఠాతుగా రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా విభజించే సరికి వీరికి ఒక టెక్నికల్ ప్రాబ్లం ఎదురయింది . అదేమిటంటే
ఏదైనా ఒక ప్రాంతీయ రాజకీయ పార్టి ఒకటి మించి వేరే రాష్ట్రాల్లో అదే గుర్తుతో పోటి చేయాలంటే దానికి జాతీయ స్తాయి గుర్తింపు కావాలి . మరి అలా ఉండాలంటే కనీసం 4 రాష్ట్రాలలో సదరు పార్టికి చట్ట ప్రకారం ప్రాతినిద్యం ఉండాలి . కాని ఇప్పుడు తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోవడం వలన కంపల్సేరిగా ప్రాంతియ పార్టీలు రెండు రాష్ట్రాలలోను పార్టీని నడపాల్సిన పరిస్తితి. మరి అటువంటప్పుడు రెండు రాష్ట్రాలలోను ఒకే గుర్తు మిద పోటి చేయాలంటే అ దానికి జాతీయ పార్టి గుర్తింపు కావాలి . అందువల్ల మరో రెండు రాష్ట్రాలు వాటికి కావాలి . ప్రాంతీయ పేరులు పెట్టుకుని ఇతర రాష్ట్రాలలో పార్టి ని విస్తరించలెరు . కాబట్టి ఉన్న ప్రత్యామ్నాయం , సెంట్రల్ చట్టానికి సవరణలు చెయ్యడం లేదా ఉన్న రెండు రాష్ట్రాలను మరో రెండు ముక్కలు చేయడం . కాబట్టి రానున్న 10 సంవత్సరాలలో మరో 2 రాష్ట్రాలు తెలుగు నాట అవతరిoచ వచ్చు .
మంచి కైనా చేడుకైనా నలుగురు ఉండాలి అంటారు . తెలుగువారి రాష్ట్రాలు కూడా నాలుగు ఉంటె మనకి జాతి య హోదా రాకపోయినా , పార్టీలకు ఒక జాతీయ గుర్తింపు వస్తుంది కదా !