Showing posts with label call boys cuture. Show all posts
Showing posts with label call boys cuture. Show all posts

Saturday, November 30, 2013

స్త్రీ లకు స్వేచ్చ నిస్తే, సమాజం లో "కాల్ గాల్స్" కంటె "కాల్ బాయ్స్ " ఎక్కువ అవుతారా ?

        కొన్ని కొన్ని విషయాలు వింటుంటే సమాజం లో స్వేచ్చకు నిజమయిన అర్దం తెలుసుకునే శక్తీ ప్రజలందరికి ఉంటుదనుకోవటం చాలా పొరపాటు అనిపిస్తుంది. జ్ఞాన వంతులు 10% ఉంటారు . మిగాతా వారు వారిని అనుసరించడమే కరెక్టు తప్పా , మెజార్టీ అభిప్రాయాలు కు విలువ ఇచ్చి దానీ ప్రకారం సమాజం ని ఉంచాలంటే దాని అంత బేవకోఫ్ తనం మరొకటి ఉండదేమో అనిపిస్తుంది . ప్రజాస్వామ్యం అంటే ప్రజలకోసం ఆలోచించేదా? లేక మెజార్టీ ప్రజల చేత ఆలోచింపబడేదా? ఒక దొంగని మెజార్టీ ప్రజలు దొర  అంటే ఒప్పుకోవలసిందేనా? ఒక వేశ్యని మెజర్తీ ప్రజలు తమ రోల్ మోడల్ అంటుంటే అంగికరించ వలసిందేనా? ఒక్కడైన సరే పది మందికి ఉపయోగపడే మాట చెపితే అది ప్రజాస్వామ్య ఆలోచన కాదా? కాదు మనం అరువు తెచ్చుకున్న ప్రజాస్వామ్య బావనలో పాక్షిక సత్యం తప్ప సంపూర్ణం గా నిజం లేదు. of the people, by the people అనేవి ప్రజాస్వామ్య సూత్రాలు అయినా కాక పోయినా , for the people మాత్రం ఖచ్చితంగ ప్రజాస్వామ్య సూత్రం. కాబట్టి ప్రజలకు మేలు చేసే మాట ఒక్కడు చెప్పినా వినే వాడే నిజమైన విజ్ణుడు. అటువంటి ప్రజలు ఉన్న సమాజమే ప్రజాస్వామ్య సమాజం.

   ఈ  ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెపుతున్నాను అంటే , స్త్రీ స్వేచ్చ కోసం పోరాటాలు చేసి, చేసి, చివరకు పురుషునితో పాటు స్త్రీ కూడా  సమానం అని రాజ్యాంగం లో రాసుకున్న మనం నిజంగా స్త్రీ స్వేచ్చ  కొన్ని విషయాల్లో సంపూర్ణంగా సాదించినట్లే కనపడుతుంది. పురుషంకార సమాజంలో "కాల్ గాళ్స్ " ఉంటే సమ సమాజం లో "కాల్ బాయిస్ " కూడా  తయరయ్యారు. శబాష్!  స్త్రీ లకు  స్వేచ్చ నిస్తే పురుషుల తో పాటు అన్నీ రంగాల్లో అభివృద్ధి సాదిస్తారు అనుకుంటే అన్ని రంగాల్లో ఏమో "అనంగ రంగం లో మాత్రం సమానత్వం సాదించారు(కొంత మంది మాత్రమే సుమా). ఈ  విషయం లో మన హైదరాబాద్ లో "కాల్ బాయిస్ గా మారిన హైదరాబాద్ యువకులు గురించి ఈ  క్రింది విడియో లింక్ ని క్లిక్ చేసి చోడండి.