Showing posts with label తెలంగాణా వాదుల వసూల్ దందా. Show all posts
Showing posts with label తెలంగాణా వాదుల వసూల్ దందా. Show all posts

Friday, November 8, 2013

తెలంగాణా వాదుల "వసూల్ దందా " నుండి వ్యాపారస్తులని రక్షించడానికే "తెలంగాణా " ప్రకటిస్తున్నారా? !

                                                     


మొన్నటి దాక చిరంజీవి గారు హైదరాబాద్ ని "U.T " చేయాల్సిందే అంటే, ఏమో లే సీమాంద్రుల కోరికను ద్రుష్టిలో పెట్టుకుని ఆ విదంగా డిమాండ్ చేసి వారి మెప్పు సంపాదించుకోవాలి అనుకుంటున్నారేమో అనుకున్నాను. కానీ మొన్న మాజీ I.P.S  అధికారి విజయ్ కుమార్ నేతృత్వం లోని "టాస్క్ పోర్స్ " బృందం , వారం రోజులు కసరతు చేసి ,కేంద్ర  హోం శాఖ కు  ఇచ్చిన నివేదిక చూస్తుంటే "తెలంగాణా" రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ వాదులు కంటే సీమాంద్ర మరియు హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటున్న ఇతర వర్గాల వారే ఎక్కువుగా కోరుకుంటున్నట్లు స్పష్టమవుతుంది చ

  ఆ మద్య ఒక సారి చిరంజీవి గారు t.r.s  మిద ఆరోపణలు చేస్తూ, వారు సినిమా వర్గాల వారి  దగ్గర  బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసిన అక్రమ వసూలకు గురించిన సమాచారం తన దగ్గర ఉందని చెప్పినట్లు గుర్తు . కాని దాని గురించి రాదాంతం చేస్తే చివరకు దాని ప్రభావం వలన తమ సినిమాలు తెలంగాణా లో నష్టపోతాయి అనే ఉద్దేశ్యంతోనే కాం గా ఉండి , తెర  వెనుక పైరవీలు చేసి "తెలంగాణ" ఏర్పాటు ప్రకటనతో తమ బాధలకు పుల్స్టాప్ పెట్టాలను కుంటునట్లుంది . మొన్న టాస్క్ పోర్స్ వారు హోO శాఖకు ఇచ్చిన నివిదేకలో 'తెలంగాణా వాదుల బలవంతపు వసూలు" నుండి సీమాంద్రుఅను రక్షించడానికి హైదరాబాద్ ని గవర్నర్ అజమాయిషిలో ఉంచాలి అని చెప్పారట. అంతే కాకుండా తెలంగాణా వ్యాప్తంగా ఉన్న సీమాంద్రుల ఆసక్తుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం అవసరం అని కూడా  నివేదికలో పొందుపర్చారు అట!

   వారు నివేదికలో ఇచ్చిన అంశాలు మరియు సీమాంద్రా మంత్రులు కోరుతున్న కోరికలు చూస్తుంటే తెలంగాణా వారికి "తెలంగాణ" అనే పేరు తప్పా ఏమి దకేటట్లు లేదు. అలగే సీమాంద్రుఅకు ఒక సమైక్యం అనేది తప్పా అన్నీ లాభాలు వారికే అనిపిస్తుంద సీమాంద్రుల రక్షణ పేరుతో పదేండ్ల పాటు కేంద్ర అజమాయిషిలో ఉన్న హైదరాబాద్ను పదకొండో సంవత్సరం అయినా  తెలంగాణ రాష్ట్రానికి ఇస్తారని గ్యారంటీ ఏమిటి? అప్పటికి మరో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తెలంగాణాలో ప్రోస్తాహించి ఆ వంక తో హైదరాబాద్ ని శాస్వతంగా కేంద్ర అజమాయిషిలో ఉంచుకుంటే కాదనే దమ్మున్న వాడు ఎవరు? ఈ  తతంగం అంతా  చూస్తుంటే తెలంగాణా సాయుడ విముక్తి పోరాటం సమయంలో జరిగిన కదా అని ఒక పెద్దాయన చెప్పిన సంగటన గుర్తుకు వస్తుంది. అదేమిటంటే :-

      తెలంగాణా లో రజాకర్ల మీద పోరాటం తర్వాత కమ్మోనిస్ట్ దళాలు తెలంగాణ లోని బూస్వాముల మీద తమ పోరాటం కొనసాగిస్తుంటే , వారిని అణచి వేయడానికి భారత ప్రభుత్వం పోలిస్ ఆక్షన్ ని రజాకర్ల లొంగుబాటు తర్వాత కోడా కొనసాగించిందట. అటువంటి సమయం లో స్తానిక కమ్మ్యూనిస్ట్ దళాలను అణచి వేయడానికి ఒక రెడ్డీ దొర  గారు పైరవీ చేసి కొంత పోలిస్ బలగాన్ని రప్పించుకుని తన బంగ్లా  లోనే  వారికి బస కల్పించి, కమ్మ్యునిస్ట్ దాడుల నుండి భయం లేకుండా చేసుకున్నాడు అంట. ఆ తర్వాత కమ్మ్యూనిస్ట్ లు కూడా  ఆ ప్రాంతాల నుండి ,కనుమరుగైనా ,ఆ పోలిస్ బెటాలియన్ కమాండర్ మాత్రం ఆ రెడ్డిగారి భవనం విడచి వెళ్ళడానికి ఇష్టపడక , పైకి తప్పుడు నివేదికలు పంపుతూ తన బలగంతో సహా అక్కడే ఉండేలా ఆర్డర్ లు తెచ్చుకున్నాడట. అను మానం వచ్చిన ఆ" దొర గారు " ఆరా తీస్తే నమ్మ లేని చేదు నిజం బయట పడిందట! ఆ దొరగారి తాలూకు "దొరసాని" కి ఆ కమాండర్ కి అక్రమ సంబందం ఏర్పడటం వలన ఆ సుఖాలను వదులుకోలేక తప్పుడు నివేదికలతో తను అక్కడే ఉండేలా ఆర్డర్ లు తెచ్చుకున్నాడట. దానితో అటు భార్యను ఏమనలేక, ఇటు పోలిస్ వారిని ఎదిరించే దమ్ము లేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడట ఆ "దొరగారు". అదీ కద.

   రేపు తెలుగు వారి పరిస్తితి అంతే . ఒకరి మీద ఒకరు  అనుమానాలతో, ఏదో వస్తుందన్న పేరాశతో రాజదాని నగరాన్ని వదులుకుంటే దానీ మీద శాశ్వతంగా ఆశ వదులు కోవాల్సిందే! తస్మాత్ జాగర్త