"వీపు నోరుని బతిమాలుద్దంట ! "నీవు వాగకే అక్కడా ,నాకు పగిలి పోద్ది ఇక్కడా " అని. అలా ఉంది "తెలంగాణా " రాష్ట్ర ప్రకటనా వ్యవహారం . అత్త ఇందిరా గాందీ గారు చెయ్యని సాహసం కోడలు సోనియా గాందీ గారు చేసేసారు . అరవై యేండ్ల సుదీర్ఘ సమస్యను ;అలవోకగా తీర్చేశారు . ఒకే ఒక్క రోజులో రెండు మీటింగులు పెట్టి ఏక వాక్య ప్రతిపాదనతో నాలుగు కోట్ల మందికి మోదం , మరో నాలుగున్నర్ర కోట్ల మందికి ఖేదం కలిగించారు .
అంతే ! అప్పటి దాక తమ మాటను కాదనదు అనే గుడ్డి నమ్మక్కంతో నేతలు , అదే స్తాయిలో ఆంద్రా ప్రజలు ఉత్కంటతతో ఎదురు చూస్తున్న వేళ ,కోడలు గారి నిర్ణయం పిడుగు పాటులా తగిలింది . దిమ్మ తిరిగి పోయింది . నేతలు ఇండ్లకు వెళ్ళలేని పరిస్తితి . అక్కడ ప్రజలకు తమ ఆక్రోశం ఎవరిమీద చూపించాలో తెలియని పరిస్తితి . బస్సులన్నీ డీపోలోనే ఉండి పోయాయి . బయట ప్రబుత్వ వాహానాలు ఏమి తిరగడం లేదు . కోపంతో చుట్టూ చూస్తున్న వారికి నవ్వూతూ దర్శన మిచ్చారు కోడలు గారి అత్తా,ఆయనా ! అంతే ఒక్కసారిగా సుత్తులు , పలుగులూ పట్టుకుని వారి మీదకు లంఘించారు . దొరికిన విగ్రహాలను సుత్తులు పెట్టి కొడుతుంటే పాపం ఆ నాయకులకి అదిరిపోయింది . కోడలు గారికి తెలిసి ఫైర్ అయ్యేసరికి , రాష్ట్ర పోలిస్ వారు విగ్రహాల ద్వంస కారుల పై కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు . అదీ కద !బ్రతికున్నంత కాలం శత్రువులను ఆదరగోట్టినా , చనిపోయాక , కోడలి గారి పనికి అదరగొత్తిచ్చుకోక తప్పలేదు మరి !