Showing posts with label స్వచ్చమైన పాలు. Show all posts
Showing posts with label స్వచ్చమైన పాలు. Show all posts

Sunday, April 14, 2013

స్వచ్చమైన పాలన ఎలాగూ ఇవ్వలేరూ! కనీసం "స్వచ్చమైన పాలు’ అయినా ఇప్పించలేరా?

                                                                            

   సైన్స్ పరిజ్ణానం వల్ల ప్రజలకు లాబం మాట ఎలా ఉన్నా,స్వచ్చమైన బ్రతుకు కి  దూరమైపోతున్నారు. ముఖ్యంగా పట్టణాలో ఉన్న ప్రజలు బ్రతికేది కూడ ఒక బ్రతుకేనా అనిపిస్తుంది.ప్రతి మనిషికి  మంచినీరు, స్వచ్చమైన గాలి, స్వచ్చమైన పాలు కావాలి. ఇప్పుడు కార్పోరేషన్ వారు సరపరా చేసే నీరు త్రాగితే రోగాలు ఖాయం అనుకుని, ప్రైవేట్ సంస్తలు సరపరా చేస్తున్న మినరల్ వాటర్ మీదే "మనీ జీవులు" ఆదారపడుతున్నారు. ఇలా ఈ నీరు అతిగా త్రాగడం కూడా  మంచిది కాదు అని చెపుతున్నారు. స్వచ్చమైన గాలి పట్టణాలో ఎలాగు దొరకదు కాబట్టి, దానికోసం అప్పుడాపుడు చుట్టు ప్రక్కల నున్న  పల్లేటూళ్ళకు వేళ్ళి పైరగాలితో సేద దీరుదామంటే, మన రైతన్నలు దండిగా పైరులపై చిమ్ముతున్న పురుగు మందుల దాటికి ముక్కులు మూసుకుని,దీనికన్న మన పట్టణ  కాలుష్య కంపే నయమనిపించి వెళ్ళలేక పోతున్నారు.

  ఇక పాల విషయానికొస్తే, పట్టాణాలలో పాల ఫాకెట్ల లో దొరికే పాలను తోడు పెట్టి,ఆ పెరుగును తింటే మనిషన్న వాడికి జీవితం మీద విరక్తి పుడుతుంది. కారణం పాలను నిల్వ చెయ్యడానికి అందులో కలిపే రసాయన పదార్థం కారణం అట!రసాయనాలు కలిపేసైన్స్ పరిజ్ణాన్మం కేవలం డైరీలు నడిపే వ్యాపారస్తులకే కాకుండా, సాదరణ పాలు అమ్మే వారికి కూడ తెలియడమ్తో, పాకేట్లు పాలలోనే కాకుండా, పల్లెటూళ్ల నుండి తెచ్చిపోసే పాలు కూడ ఈ కల్తీకి గురికాక తప్పడం లేదు. టీ లూ, కాఫి,లు లో పెద్ద తేడా పట్టించుకోపోయినా పెరుగు విషయం లో మాత్రం కాంప్రమైజ్ కాలేక పోతున్నారు. "సప్త సముద్రాలు ఈది వచ్చిన ఘనుడు ఇంటి వెనుక మురికి కాలవలో పడి చచ్చినట్లు ఉంది" .మన సైన్స్ అభివ్రుద్ది.సంతోషంగా బ్రతుకుదామన్న మన ప్రస్తానం చివరకు "కల్తీ బ్రతుకు" కు బలి కాక తప్పడం లేదు.

  ఏది ఏమఈనా అన్నిటికి మనకు కనపడే మూల కారణం  పాలకులే కాబట్టి వారినే అదుగుదాం. " అయ్యా  పాలకులారా   స్వచ్చమైన పాలన ఎలాగూ ఇవ్వలేరూ! కనీసం "స్వచ్చమైన పాలు’ అయినా ఇప్పించలేరా?