అదినేతలూ, రాజకీయ రంకును ప్రోత్సాహించకండయ్యా! |
రెండూ ఒకటే మొదటిది శారీరక పరమైన "రంకు", రెండవది రాజకీయ పరమైన "రంకు", అంతే తేడా!
అరెరే!పదియెండ్లు, ముప్పైయేండ్లు ఒకే పార్టిలో ఉండి అనేక కీలక పదవులు అనుభవించిన వారిక్ కూడా "పదవుల" మీద ఆశ చావకపోతే ఎలా? వీరిని నమ్మా ప్రజలు వోట్లు వేసి గెలిపించేది?ఇన్నాళ్లు నమ్మిన పార్టిలనే నట్టేట ముంచిన వాడు, జనాల్ని ముంచడని గ్యారంటీ ఏమిటి? పై పెచ్చు ముందుగానే "బేరాలు" ఆడుకుని పలాని సీటు ఖాయమనుకున్నాకే పక్క మారుతున్నారట!
ఇలాంటి వారిని గురించి రామదాసు గారు ఒక మంచి మాట చెప్పారు!
"పదవూలు, బిరుదులు పైనా,
పర నారీ పెదవుల పైనా,
బుద్దంతా నిలిపేవాడూ, బూడిదైపోతాడు!
ఖచ్చితంగా ఎరుక గలిగిన ప్రజలు, వీరికి డిపాజిట్లు దక్కకుండా చేస్తారేమో చూడాలి.