Showing posts with label స్త్రీల రక్షణ. Show all posts
Showing posts with label స్త్రీల రక్షణ. Show all posts

Thursday, January 3, 2013

"తిండి నీ కోసం తిను, బట్టలు మాత్రం ఎదుటివారి కోసం కట్టు"


                                    ఈమద్య జరిగిన డిల్లీ గాంగ్రేప్ ఉదంతం  తర్వాత "స్త్రీల రక్షణ" అనెది ఒక పెద్ద సమస్యగా అటు ప్రబుత్వం ఇటు ప్రజలు గుర్తీంచారు. స్త్రీల మీద లైంగిక దాడులు అపటానికి ఎవరికి తోచిన మార్గం వారు చెపుతున్నారు. దీనికి ఎవరూ ఎవర్ని తప్పు పట్టాల్సింది ఏమి ఉండక పొవచ్చు.

  స్త్రీల రక్షణకు పటిష్టమయిన చట్టాలు, దానిని  చిత్తశుద్దితో అమలు చేయగల యంత్రాంగమ్ ఏర్పాటు విషయం లో, ఏ వర్గానికి అబ్యంతరాలు లేవు. కాని స్త్రీల వస్త్రదారణ విషయం లో కొన్ని జాగ్రతాలు తీసుకోవాలి అని సూచించి నప్పుడు ఆదునిక యువత కు ఇది నచ్చడం లేదు. ఇటువంటి సూచనలను  స్త్రీ వాదులు సహితం ఖండిస్తున్నారు. డిల్లీ వీదుల్లో ఆడపిల్లలు " మా శరీరం, మా ఈష్టం" అని రాసిన ప్లకార్డులు పట్టుకుని "అమానత్" దురంతానికి నిరసన తెలిపే కార్య క్రమం లో పాల్గొన్నారు అంటే, దీనిని బట్టి తెలిసికోవచ్చు వారు ఎటువంటి స్వేచ్చ కోరుకుంటున్నారో.!

పోలిస్ అదికారులు కొంత మంది చెపుతున్న దాని బట్టి, అదునిక స్త్రీల వస్త్ర దారణ కూడ  వారి మీద అత్యాచారాలు జరగటానికి ఒక కారణం. దీని సాంప్రదాయ వాదులు ఎలాగు సమర్దిస్తారు కాబట్టి, స్త్రీ వాదులు దీనిని వ్యతిరేకిస్తారు.. చదువుకునె ఆడపిల్లల్లో కొంత మంది స్త్రీవాద తరహ(నా బాడి, నా ఇష్టం) స్వేచ్చ ని సమర్దిస్తూ,  వీదుల్లోకి వస్తుంటే ఇష్టం లేని వారు సహితం వారిని మౌనంగా అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్తితిలు అటు వంటివి.

  మన కొక సామెత ఉంది. "తిండి నీ కోసం తిను, బట్టలు ఎదుటివారి కోసం కట్టు" అని .ఇది నూటికి నూరు పాల్లు నిజం. మనం ఎంత కోటీశ్వరులమయినా "షుగర్ వ్యాది" ఉంటే పంచ బక్ష్య పరమాణ్ణం తినలేం కదా! ఎందుకంటే తింటే చస్తాం కాబట్టి. వస్త్ర దారణ అలాంటిదే. మనకు బట్టలు అవసరం లేదని అవి లేకుండా వీదుల్లోకి పోలేము కదా. ఎందుకని ?మనం బట్టలు వేసుకోకపోతే మనకు లేని నష్టం ఎదుటివాడికి ఏమిటీ? ఎందుకు న్యూసెన్స్ కేస్ పెడతారు? ఎందుకంటే మన పైత్యం ఎదుటివారిలో అనేక వికారాలు కలిగిస్తాయి కాబట్టి.అలా వికారం కలిగించని వస్త్ర దారణే మనం చెయ్యాలి. లేదా మనంఎలా ఉన్నా వికారం పొందని హై క్లాస్(వారి ద్రుశ్టిలో) వారు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి పోవడం మంచిది.ఇటు వంటి హై క్లాస్ వారు తమ దనం తో  ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని ఆనందంగా ఎగరవచ్చు. అంతే కాని నూటికి తొంబైమంది సాంఫ్రాదయవాదులు ఉన్న దేశం లో వారు చెపుతున్న దానికి విలువనివ్వకుండా, కేవళం వ్యాపార సంస్క్రుతికి పనికి వచ్చే అదునికతను అనుసరించాలనడం నియంత్రుత్వమే అవుతుంది.సాంప్రదాయ వాదులది ఒకటే మాట" మాకు స్త్రీ రక్షణే ముఖ్యం. దానికోసం  అవసరమయిన అన్ని మార్గాలను అనుసరిస్తాం. అనుమానమున్న మార్గాలు మూసివేస్తాము".