పెబ్రవరి7 , 2014 లో సోషలిస్ట్ దేశమైన రష్యా లోని సోచి స్టేడియం లో వింటర్ ఒలంపిక్స్ గేమ్స్ 2014 మొదలు కాబోతున్నాయి . ఇవి పెబ్రవరి 23 వరకు సాగుతాయి. ఒలంపిక్స్ సాంప్రదాయం ప్రకారం "ఒలంపిక్స్ టార్చ్ " ని వెలిగించి అది ఆరకుండా వివిధదేశాల క్రీడాకారుల బాగస్వామ్యంతో అన్ని ప్రాంతాలలో తిప్పి, చివరకు ఆ టార్చ్ తోనే స్టేడియం లో లోని జ్వాలను రగిలించడం ద్వారా, ఒలంపిక్స్ గేమ్స్ ప్రారంబిస్తారు. ఇందులో ప్రదానమైన మైన విషయం ఏమిటంటే "ఒలంపిక్స్ జ్యోతి" బయలు దేరిన నాటి నుండి స్టేడియం కు తిరిగి చేరే వరకు వెలుగుతూనే ఉండాలి.
కానీ ఈ సారీ గేమ్స్ నిర్వహిస్తుంది ఘనత వహిస్తున్న సోషలిస్ట్ దేశం గా ప్రకటితమైన రష్యా వారు కాబట్టి, వారికి సాంప్రఫ్దాయలు అంటే అసలు పడదు కాబట్టి ఒక కొత్త ఆలోచన చేసి దానిని అమలు చేస్తున్నారు. తాము నిర్వహించే "వింటర్ఒలంపిక్స్ 2014 " తర తరాలు గుర్తుండి పోయేలా ఒలంపిక్స్ జ్యోతి ని బూమి మీదే కాక అంతరిక్షం లో కూడా తిప్పాలని సంకల్పించారట. మరి అక్కడ మనుషులు ఉండని ప్రాంతం కదా అంటే ఎవరైనా అనుకోవచ్చు. మనుషులు ఉండక పోతే ఉండక పోయారు కనీసం ఒలంపిక్స్ జ్యోతి వెలగడానికి అవసరమైన గాలి కూడా ఉండదు. అంతే కాదు స్పేస్ క్రాప్ట్ లోకి వెళ్లగానే ఆ జ్యోతి ని అర్పి వేయాలి. ఇందుకు బద్రతా పరమైన అంశాలు కారణం. అలాగే వ్యోమ నౌక నుండి బయటకు వెళ్లి అంతరిక్ష నడక నడచేటప్పుడు , అక్కడ ఆక్సిజెన్ ఉండదు కాబట్టి 'ఒలంపిక్స్ జ్యోతి " వెలిగే ప్రశ్నే లేదు. అంటే ఎప్పుడైతే ఒలంపిక్స్ జ్యోతి తో వ్యోమగాములు స్పేస్ క్రాప్ట్ లో ప్రవేసిస్తరో అప్పుడే ఒలంపిక్స్ జ్యోతి ఆరిపోతుంది. ఇక ఆ ఆరిపోయిన జ్యోతి ని అంతరిక్షం లో తిప్పి తమ "పిచ్చి" ని ప్రదర్సీమ్పబోతున్నారన మాట ఘనత వహించిన వ్యోమగాములు , వారిని ప్రోస్తహిస్తున్న సైంటిస్ట్ లు, మేదావులు, ప్రభుత్వాలు.అలా మద్యలో ఆర్పివేసిన "ఒలంపిక్స్ జ్యోతి"తో బ్రహ్మాండంగా "వింటర్ ఒలంపిక్స్ 2014" ప్రాంబిస్తారట.