Showing posts with label గాందీ గారి బొమ్మే. Show all posts
Showing posts with label గాందీ గారి బొమ్మే. Show all posts

Tuesday, April 9, 2013

గాందీ గారి బొమ్మే పెట్టుకుంటే లేని అభ్యంతరమ్ N.T.R గారి బొమ్మ మీదెందుకు బాబు గారు!

                                                             
                                                                         అప్పుడప్పుడు మాట్లాడే కొంత మంది మేదావుల మాటలు సైతం మనకు నవ్వూ, ఆశ్చర్యం కలిగిస్తుంటాయి.ఈ మద్య Y.S.R    పార్టీ వారుN.T.R   గారి బొమ్మ ప్లెక్సీ ల మీద పెడితే పెద్ద దుమారమే రేగింది. మా నాయకుడి బొమ్మ పెట్టడానికి మీరెవరు అని తెలుగు దేశం వారు ప్రశ్నిస్తే, N.T.R   గారిని వెన్నుపోటు పొడిచి అధికారం లోకి వచ్చిన చంద్రబాబు గారి నాయకత్వం లో ఉన్న పార్టీకి ఆ ప్రశ్న అడిగే హక్కు లేదని    Y.S.R   పార్టీ వారు కౌంటర్ ఇచ్చారు.సరే ఇంతవరకు బాగానే ఉన్నా, తెలుగుదేశం అదినేత గారు లేవనెత్తిన అబ్యంతరం కొంచం నవ్వు తెప్పిస్తుంది.

   లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డ, Y.S.R  పార్టీ వారికి నీతి, నిజాయతికి మారు పేరైన N.T.R   గారి బొమ్మ ని, జగన్ గారి పక్కన పెట్టడం బాధ కలిగిస్తుందన్నారు. ఒక వేళా చంద్రబాబు గారు చెప్పేది నిజమయితే ఈ దేశ ప్రజలు బాదతో ఎప్పుడో క్రుంగి క్రుశించి పోయి ఉండే వారు. నిజంగా ప్రస్తుతమున్న రాజకీయ పార్టీలో "గాంది" గారి బొమ్మను పెట్టుకునే నైతిక అర్హత ఎంత మందికుంది?మరి వీరంతా పెట్టుకుంటుంటే బాదపడని ప్రజలు, లేక వారి నాయకులుN.T.R   గారి బొమ్మ జగన్ గారి పక్కన పెడితే ఎందుకు బాద పడాలి?

  తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక N.T.R   గారు. అసలు తెలుగుదనమే రాష్ట్రం నుండి మాయమవుతుంటే ఇక అన్న గారి బొమ్మ ఎక్కడపెడితే ఏముంది!ఆయన బొమ్మ కొంతమందికి సినిమాల రూపంలో కాసులు కురిపిస్తే, మరి కొంత మందికి వోట్లు రాలుస్తుంది.మనలో తెలుగుదనం ఉన్నంత కాలం మన గుండేల్లో  N.T.R       ఉంటారు.