Showing posts with label అనూహ్య మర్డర్ కేసు. Show all posts
Showing posts with label అనూహ్య మర్డర్ కేసు. Show all posts

Monday, March 3, 2014

ముంబాయి పోలీసులు అనూహ్య మర్డర్ కేసును మరో "అయేషా " కేసు గా మార్చ బోతున్నారా !?

                                                             


వినేవాడి చెవిలో పువ్వులు ఉంటె చెప్పేవాడు ఎన్ని కట్టు కదలు చెప్పటానికైన రెడి ! భారత దేశం లో నిర్బయ ఉదంతం తర్వాత జరిగిన హత్యల్లో ఆంద్ర ప్రదేస్ లో ని మచిలీ పట్నం కు చెందిన మహిళా  ఇంజనీర్ అనూహ్య కేసు కూడా ఒకటి . అ హత్య జరిగి నెలలు గడుస్తున్నా నిన్నటి వరకు ఏ  క్లూ సాదిo చినట్లు ముంబాయి పోలీసులు మీడియాకు చెప్పలేదు . ఈ రోజు మాత్రం ఒక 35 ఏండ్ల వ్యక్తిని, హత్య చేసిన నిందితుడిగా ముంబాయి కోర్టులో ప్రవేశ పెట్టి , రిమాండ్ కు పంపించారు . కొద్ది సేపటి క్రితం ముంబై  పోలిస్ వారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి , అనూహ్య కేసులో మిస్టరి చేదిoచామని, ఆమెను  సనప్  అనే పాత నేరస్తుడు , టాక్సీ డ్రైవర్ గా ఆమెను తీసుకు వెళ్లి , అత్యాచారం లేక రాబరి చేయబోతే ఆమె ప్రతిఘటించడం వలన , ఆమెను ఉరి వేసి చంపి , ఆ  పై పెట్రోల్ పోసి తగల బెట్టాడని చెప్పుకొచ్చారు . ఇదంతా వింటుంటే కొన్ని అనుమానాలు బుర్ర ఉన్న వారికెవరికైనా జనిస్తాయి . మరి ఘన మైన ముంబాయి పోలిస్ వారికి రాలేదంటే నమ్మడం కష్టం . కావాలనే ఎవరో వెనుక ఉండి ఈ  కేసును అయేషా కేసు లో మాదిరి పక్క దారి పట్టించి అసలు నెరస్తులను రక్షించడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది . ఈ  కేసులో కలుగుతున్న అనుమానాలేమిటంటే ---

    ఎస్తేర్ అనూహ్య ముంబాయి T.C.S కంపెనీలో ఉద్యోగిని . ఆమె గత క్రిస్టమస్ కి తన స్వస్తలం మచిలీ పట్నానికి  వచ్చి , తిరిగి జనవరి మూడవ తారికున బయలు దేరింది . 4 వ తారికున హైదరాబాద్లోని ప్రెండ్స్ తో పార్టి లో పాల్గొని ఆ సాయంత్రం ముంబాయికి రైలులో బయలు దేరింది . 5 వ తారీకు తెల్లవారు జామున ముంబాయిలో దిగిన తర్వాత కొంత సేపు వెయిటింగ్ రూమ్ లో ఉండి అ తర్వాత ఒక వ్యక్తికీ తన బ్యాగ్ ను ఇచ్చి , తానూ సెల్ పోన్లో మాట్లాడుతూ బయటకు వేలుతుండడం క్లియర్ గా రైల్వే స్టేషన్ లోని సి.సి. పుటేజ్ లలో కనిపించింది . అయితే ఆమె తో పాటు పుటేజ్ లలో కనిపించిన వ్యక్తే ఈ రోజు పోలీసులు చెపుతున్న
   సనప్  పాత నెరస్తుడట.పార్ట్ టైం కాబ్ డ్రైవర్ గా ఉన్న అతనికి అనూహ్యను తీసుకు వెళ్ళిన రోజు మాత్రం కాబ్ లెదట . తను కాబ్ డ్రైవర్ ని అని చెప్పి ఆమెతో 300 రూపాయల బేరం కుదుర్చుకున్న అతను  బయట వరకు ఆమెను తీసుకువచ్చిన తర్వాత , తన దగ్గర కాబ్ లేదని మోటార్ సైకిల్ మిద డ్రాప్ చేస్తాను అంటే మొదట్లో అనూహ్య ఒప్పుకోలేదట . అ తర్వాత ఆతను అనుమానం ఉంటె నా సెల్ తీసుకుని మిరేవరితోనైనా పోన్ చేసి విషయం చెప్పండి, కాని నన్ను మాత్రం నమ్మండి , మిమల్ని నమకంగా ఇంటి దగ్గర దిగబెడతాను అంటే , దానికి ఆమె కూడా అతని పోన్ తీసుకుని ఎవరికో పోన్ చేసినట్లు నటించిందట కాని నిజంగా చేయలేదట . గుడ్డిగా అతనిని అనుసరించి హత్యకు గురి అయిo దట . ఇది పోలిస్ వారి కహాని . ఈ కహాని లో   కలుగుతున్న అనుమానాలేమిటంటే -

  (1).  ముక్కు ,  ముఖం తెలియని వాడు కాబ్ ఉందని చెప్పి బయటకు తీసుకు వచ్చి , అక్కడ మోటార్ సైకిల్ చూపించి దాని మిద దిగబెదతాను అంటే అ ఇంజనీర్ నమ్మి గొర్రె పిల్లలా అతని వెంట వెళ్ళిందా ?

 (2). "నా మిద అనుమానం ఉంటె మిరేవరికైనా నా సెల్ లోనే నా గురించి సమాచారం ఇచ్చాకె నాతొ రండి"అని అతడు అంటే సరే అని సెల్ తీసుకుని ఎవరితోనో మాట్లాడినట్లు నటించాల్సిన అవసరం ఆమెకు  ఏమిటి? ఖచ్చితంగా ఆమె తనకు తెలిసిన వారేవరితోనో మాట్లాడి , వారు పర్వాలేదు అతనితో వెళ్ళమని రికమెండ్ చేసాకే వెళ్లి ఉండాలి . అ నిందితుడు కూడా  ఆమెకు తెలిసిన వ్యక్తీ చెపితేనే ఆమెను పికప్ చేసుకోవడానికి వచ్చానని , కావాలంటే అతనితో/ఆమె తో మాట్లాడండి అని తన సెల్ ఇచ్చి ఉండాలి . అ విషయాన్ని ఆమె అతని సెల్ ద్వారా కన్పర్మ్  చేసుకున్నాకే అమాయకంగా అతనిని అనుసరించి బలి అయి పోయి ఉంటుంది .
(3). ఈ  కేసులో ముంబాయి పోలీసులను ఇమ్ప్లూయన్స్ చేయగలిన వారి హస్తం ఉంది ఉండాలి .వారికి ఆ అమ్మాయికి ఏదో బేదాభిప్రాయాలు ఉంది ఆమె బ్రతికి ఉంటె తమకు ముప్పు అని ముంబాయి పాత నేరస్తులతో ఆమెను ప్లాన్ ప్రకారం హత్య చేయించి ఉండాలి . తమక్జు ఉన్న ఇన్ప్లోయన్స్ తో కేసుకు మసి పోసి మారేడు కా య చేసి , పాత నేరస్తులకు కేసు అంట గట్టి , తము తప్పించుకునే ప్రయత్నం అని అనిపిస్తుంది తప్ప, పోలిస్ వారి కహాని ఎ మాత్రం నేమ్ విదంగా లెదు.
        ఈ కేసును నిజాయితిగా సి.బి.ఐ వారి చేత దర్యాప్తు చేస్తే తప్పా నిజాలు నిజాలు వెలుగులోకి రావు . అ  దిశగా ఆమె సంబదికులు చర్యలు తీసుకోవాలి . అవసరమైతే తెలుగు  ప్రజా సంఘాలను కదిలిoచితే తప్పా అనూహ్య కుటుంబానికి న్యాయం జరుగదు .

Friday, January 17, 2014

ముంబాయి డాన్సర్ "రేప్" కేసు కున్న ప్రాదాన్యత, మచిలీపట్టణం ఇంజనీర్ అనూహ్య మర్డర్ కేసుకు లేదా ?

                                                             


 లేదనే అనిపిస్తుంది , ముంబాయి పోలిసుల తీరు  చూస్తుంటే . ఇక విషయానికి వస్తే , మొన్నీ  మద్య ,హైదరాబాద్ లో జనవరి 1 వేడుకల్లో డాన్స్ చెయ్యడానికని ముంబాయికి చెందిన డాన్సర్ ఒకామె హైదరాబాద్ కి వచ్చింది . ఆమెను ఎయిర్పోర్టులో పికప్ చేసుకోవడానికి వచ్చిన వారు ఆమెకు మత్తు  మందు ఇచ్చి , దూరంగా ఎక్కడి కో  తీసుకు వెళ్లి, ఆమె మిద సామూహిక అత్యాచారం జరపి , ఆమె దగ్గరున్నది దోచుకుని , అ తర్వాత ఆమెను ముంబాయి బస్ ఎక్కించారట . ఆమె కూడా మత్తులో ఉండటం వలన ఇవేవి గమనించక ఇంటికి పోయి చూసుకున్న తర్వాత గాని తనకు జరిగిన అన్యాయం అర్ధం కాలేదట . అక్కడి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే వారు పట్టించుకో పోయేసరికి , తనకున్న ఇన్ప్లూయన్స్ తో ఒక సామాజిక సంస్ట  ద్వారా  ముంబాయి పోలీసులను కదిలించి , వారిని తీసుకుని హైదరాబాద్ కు వచ్చి , ఇక్కడి పోలీసులను కదిలిస్తే , అప్పటికప్పుడు 4 స్పెషల్ టీంలు  ఏర్పాటు చేసి నిందితులను పట్టుకుని కట కటాల  వెనుకకు నెట్టారు . ఈ  కేసు గురించి పోలిస్ అధికార్లు ఎంత శ్రద్ద తీసుకున్నారో పోలిస్ అధికారుల మాటల్లోనే ఈ విడియో  ద్వారా తెలుస్తుంది . ఇందుకు హైదరాబాద్ పోలిస్ వారిని అభినందించి తీరవలసిందే !


                                               

  అయితే ఇక్కడొక ప్రశ్న  ఏమిటంటే , ముంబాయికి చెందిన అమ్మాయి రెప కేసు గురించి హైదరాబాద్ పోలీసులు చూపించిన శ్రద్ద లో , మచిలీ పట్నానికి  చెందిన తెలుగు ఇంజనీర్ అనూహ్య ఘోరంగా మొన్న తగులపెట్టబడి శవంగా ముంబాయి సమీపంలో దొరికితే , ఆ  కేసు మిద ముంబాయి పోలీసులు వందవ  వంతైనా చూపించారా అని ?
  ఈ  కేసు వివరాలు లోకి వెళితే , మచిలీ పట్నానికి  చెందిన అమ్మాయి అనూహ్య ముంబాయి లో ఇంజనీర్ గా ఉద్యోగం  చేస్తుంది . క్రిష్టమస్ సెలవులకు ఇంటికి వచ్చిన అనూహ్య ,పండగ తర్వాత ముంబాయి వెళ్ళింది . కాని ఆమె ముంబాయి చేరినట్లు సమాచారం ఆమె తండ్రికి రాలెదు. అ రోజు నుంచి ఆమె ఏమైందో అర్ధం కాలెదు. దానితో విజయవాడ రైల్వే పోలిస్ స్టేషన్ లో ఆమె తండ్రి పిర్యాదు చేస్తే , మిస్సింగ్ కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు కేసును ముంబాయి పోలీసులకు బదిలీ చేసారు . కానీ అక్కడి పోలీసులు ఈ  కేసును ఎ మాత్రం పట్టించుకోక పోవడం తో , అమ్మాయి తాలూకు వారె ఒక టీం  గా ముంబాయి వెళ్లి అక్కడి స్తానికుల సహకారం తో గాలింపు చేపట్టారు . చివరగా వారికి ఒక చోట తగుల పెట్టబడి కంపు కొడుతున్న స్తితిలో , అనూహ్య శవం  కనిపించగా , ఆ  సమాచారాన్ని తండ్రికి చెపితే అయన ముంబాయి వెళ్లి, దారుణంగా హత్య చేయబడిన తన కూతురు ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు . కాని ఈ విషయం  లో ముంబాయి పోలీసులు ఎ మాత్రం పట్టించుకోలేదని తెలుస్తుమ్ది..  దిని మిద అమ్మాయి తాలూకు వారి బాదను క్రింది విడియో లో చూడండి . కాబట్టి దిని వలన అర్దమయ్యేది ఒకటే , ముంబాయి డాన్సర్ గారికి ఉన్న ఇంప్లూయన్స్  ఆంద్రా  అమ్మాయి తల్లి తండ్రులకు లెదు. ఉంటే ఇంత నిమకు నిరెత్తినత్లు ఉంటారా పోలీసులు ?
ముంబాయి అయినా , హైదరాబాద్ అయిన అందరూ ఇండియన్ పోలీసులే . మరి డాన్సర్ గారి విషయంలో చూపిన శ్రద్ద , అబాగ్య ఇంజనీర్ విషయం లో ఎందుకు చూపించడం లేదు? ఈ  విషయం లో తెలుగు వారు అంతా అనూహ్య తల్లి తండ్రులకు సంగి బావం తో కూడిన సంతాపం తెలుపాల్సిన   అవసరం ఉంది . దానిలో బాగంగానే అనూహ్య తల్లి తండ్రులకు కల్కి ఖడ్గం బ్లాగర్ గా నా సంఘీ బావం ను మరియు సంతాపం ని తెలియ చేస్తున్నాను.