Showing posts with label తెలంగాణా నోట్. Show all posts
Showing posts with label తెలంగాణా నోట్. Show all posts

Wednesday, September 11, 2013

"తెలంగాణా నోట్" లో ఏం పెట్టిన్రు? తెలంగాణా వారి నోట్లో ఏం పెట్టబోతున్రు ? జర జల్దీగా చెప్పండి !

                                                                    


 అదిగో తెలంగాణా నోట్, ఇదిగో తెలంగాణ నోట్ అని తెలంగాణా వారిని ఊరించి, ఊరించి చంపుతున్నారు కేంద్ర హోమ్ మంత్రి షిండే గారు.నిన్నటి దాక తెలంగాణ ఇచ్చుడు ఖాయమని, హైద్రాబాద్ మీద మాత్రం కేంద్రం వారి నిర్ణయమే పైనల్ అని సెలవిచ్చారు మంత్రి వర్యులూ. హైద్రాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గా చేస్తే ప్రజా స్పందన ఎలా ఉంటుంది అని నిన్నటి దాక పత్రికలకు లీక్ చెయ్యటం ద్వారా పరీక్షించిన కేంద్రం వారు, ఇప్పుడు డిల్లీ తరహా రాష్ట్రం గా హైద్రాబాద్ ని చేస్తే ఎలా ఉంటుంది అని మరొక వార్తను ప్రజల్లోకి వదిలారు. కేంద్ర పాలిత ప్రాంతంగా చెయ్యడానికి హైద్రబాదీ రాజకీయ నాయకులు ఈ విషయం లో ఒప్పుకోవచ్చని బావిస్తుంది కేంద్ర ప్రభుత్వం . తమ చిరకల మిత్రులైన మజ్లిస్ వారిని,హైద్రాబాదీ  తెలంగాణా కాంగ్రెస్ వారిని, సెట్టిలర్స్ ని సంత్రుప్తి పరచవచ్చని అధికార పార్టీ వారి ఆలోచన. ఈ విషయం చూచాయాగా తెలియబట్టే కె.సి.ఆర్. గారు కూడా ఎదో విదంగా ఉద్యమాల రూపంలో నిరసన తెలియ పరుదాం అని బావిస్తున్నట్లుంది.

 మొత్తానికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అవుతుందేమో ,తెలుగు వారి పోరాట  పలితం. తెలంగాణ ఇచ్చుడు ఖాయం. , అనేదే కేంద్రం వారు తెలంగాణ వారికి చెప్పదలచిన మాట . అందుకే మాట్లాడితే తెలంగాణా నోట్,తెలంగాణా నోట్ అంటుంది కానీ, ఆ నోట్ లో అసలు ఏముంది"తెలంగాణ ఇచ్చుడు ఖాయం.హైద్రాబాద్ పోవుడు ఖాయం" అని ఉందా లేదా? ఉంటే కొంచం తొందరగా చెప్పేస్తేఅటు" సంబరాలు "ఇటు  "సంబురాలు" చేసుకుంటారు, నమ్ముకున్న జనం! ఇంతకి తెలంగాణా ప్రజల నోట్లో బెల్లం గడ్డ పెడుతున్నారా! మట్టి గడ్డ కొడుతున్నారా! అనేది కేంద్రం వారి నోట్ వస్తే కానీ తెలియదు. ఎలాగు అమ్మ, అమెరికా నుండి వచ్చింది కాబట్టి వారం లోపే తెలంగాణ నోట్ గురించి తెలివిగల తెలుగువారికి తెలిసి పోవచ్చు.