Showing posts with label రామిరెడ్డి వెంకట రెడ్డి. Show all posts
Showing posts with label రామిరెడ్డి వెంకట రెడ్డి. Show all posts

Wednesday, February 26, 2014

ఖమ్మం జిల్లా మంత్రి ,శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి &అదర్స్ మిద మద్యం సిండికేట్ కేసు పెట్టాల్సిందే అన్న హై కోర్టు !

                                                         


రూల్ ఉంటె కోర్టుకు పో ! లేకుంటే మంత్రి దగ్గరకు పో ! అనేది లౌక్యం తెలిసిన కార్య సాధకుల మాట!. ఆ  మాట అక్షరాల నిజమేనని రుజువైంది ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు రుజువు చేస్తున్నాయి . కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలన సంగతి ఎలా ఉన్నా ,బడా  బడా నిందితులు మిద చట్ట పరమైన చర్యలు తీసుకున్నది మాత్రం అయన గారి హయాంలోనే . అయితే అయన గారి నిజాయితిని కూడా సవాలు చేసేలా తయారయింది 2012 లో A.C.B  వారు జరపిన మద్యం సిండికేట్ కెసు. ఈ  కేసులో 12 మంది M.L.A  లతో పాటు ఇద్దరు మంత్రులు శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి , మోపిదేవి వెంకట రమణతో సహా చాలా మంది అధికార అనదికారులమిద విచారణ జరిపారు . అయితే సరి అయిన ఆదారాలు ఉన్నా ప్రజా ప్రతినిధులు మిద కేసులు నమోదు చేయకుండా , రాజకీయ ఒత్తిడికి తలొగ్గి కేసును నిరు గార్చడానికి చూస్తున్నారని A.C.B మిద ఆరోపణలు వచ్చాయి .

   చివరకు ఆ ఆరోపణలు ఆదారంగా హైకోర్టులో ఒక ప్రజా హిత వ్యాజ్యం దాఖలు కాగా , దానిని పరిశిలిoచిన ఆంద్ర ప్రదెస్ హై  కోర్టు వారు ఆదారాలు ఉన్న వారి మిద కేసులు నమోదు చేసి 3 నెలలలో విచారణ పూర్తీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ  చేసింది . ఇన్నాళ్ళు ఆగి తీరా ఎన్నికల ముందు ఇలా హై  కోర్టును ఆశ్రయించడం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చు కాని ,  చైతన్యం కల ప్రజలు ఉన్న సమాజంలో పాలకులు తాము ఏమి చేసినా అడిగే వారు ఉండరు అనుకోవటం పొరపాటే . ఆదారాలు ఉంటె ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరు . నిందితులు కోర్టుల్లో విచారణ ఎదుర్కుని తమ నిర్దోషిత్వాన్ని నిరూపిoచు కోవలసిందే  అని పై ఉదంతం తెలియ చేస్తుంది .
  ఈ విషయం గురించి మరింత సమాచారం కొరకు క్రింది విడియో ను చూడండి