రూల్ ఉంటె కోర్టుకు పో ! లేకుంటే మంత్రి దగ్గరకు పో ! అనేది లౌక్యం తెలిసిన కార్య సాధకుల మాట!. ఆ మాట అక్షరాల నిజమేనని రుజువైంది ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు రుజువు చేస్తున్నాయి . కిరణ్ కుమార్ రెడ్డి గారి పాలన సంగతి ఎలా ఉన్నా ,బడా బడా నిందితులు మిద చట్ట పరమైన చర్యలు తీసుకున్నది మాత్రం అయన గారి హయాంలోనే . అయితే అయన గారి నిజాయితిని కూడా సవాలు చేసేలా తయారయింది 2012 లో A.C.B వారు జరపిన మద్యం సిండికేట్ కెసు. ఈ కేసులో 12 మంది M.L.A లతో పాటు ఇద్దరు మంత్రులు శ్రీ రామిరెడ్డి వెంకట రెడ్డి , మోపిదేవి వెంకట రమణతో సహా చాలా మంది అధికార అనదికారులమిద విచారణ జరిపారు . అయితే సరి అయిన ఆదారాలు ఉన్నా ప్రజా ప్రతినిధులు మిద కేసులు నమోదు చేయకుండా , రాజకీయ ఒత్తిడికి తలొగ్గి కేసును నిరు గార్చడానికి చూస్తున్నారని A.C.B మిద ఆరోపణలు వచ్చాయి .
చివరకు ఆ ఆరోపణలు ఆదారంగా హైకోర్టులో ఒక ప్రజా హిత వ్యాజ్యం దాఖలు కాగా , దానిని పరిశిలిoచిన ఆంద్ర ప్రదెస్ హై కోర్టు వారు ఆదారాలు ఉన్న వారి మిద కేసులు నమోదు చేసి 3 నెలలలో విచారణ పూర్తీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది . ఇన్నాళ్ళు ఆగి తీరా ఎన్నికల ముందు ఇలా హై కోర్టును ఆశ్రయించడం వెనుక రాజకీయ కారణాలు ఉండవచ్చు కాని , చైతన్యం కల ప్రజలు ఉన్న సమాజంలో పాలకులు తాము ఏమి చేసినా అడిగే వారు ఉండరు అనుకోవటం పొరపాటే . ఆదారాలు ఉంటె ఎంతటి వారైనా చట్టం నుండి తప్పించుకోలేరు . నిందితులు కోర్టుల్లో విచారణ ఎదుర్కుని తమ నిర్దోషిత్వాన్ని నిరూపిoచు కోవలసిందే అని పై ఉదంతం తెలియ చేస్తుంది .
ఈ విషయం గురించి మరింత సమాచారం కొరకు క్రింది విడియో ను చూడండి
http://www.newindianexpress.com/cities/kochi/Parents-Have-a-Say-in-Marriage-of-Their-Children-Kerala-HC/2014/03/01/article2083620.ece#.UxQKoH1X5oO
ReplyDeleteకేరళ కోర్ట్ నిర్ణయం మీకు ఆనందం కలిగిస్తుందను కొంటాను. ఆ వార్త చదవటం మీరే గుర్తొచ్చారు.
ReplyDeleteదన్యవాదాలు శ్రిరామ్ గారు . మంచి సమాచారం ఇచ్చారు .దీని మీద రేపు ఒక టపా పెదతాను నా "మనవు " బ్లాగులొ
ReplyDelete