(స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా పునః ప్రచురణ చేయడమైనది .)
చాలామంది, దివంగత నటులుశ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారికి దేవుడు అంటే నమక్కo లేదు అనుకుంటారు . అయన గారు కూడా ఒక ఇంటర్వ్యూ లో తనకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదని చెప్పారు తప్పా , తనకు అసలు నమక్కం లేదని చెప్పలెదు. అయన గారికి దేవుడు మిద అపారమైన నమ్మక్కం ఉందని చెప్పటానికి అయన గారికి ఉన్న "నాగ" సెంటిమెంటే ఉదాహరణ .
శ్రీ అక్కినేని నాగేశ్వర రావు గారు , ఆయన 1923 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురం లో జన్మించాడు. చిన్ననాటినుండే నాటకరంగంవైపు ఆకర్షితుడై అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు లో 1933 ఆగస్టు 14న ఆమె జన్మించారు. ఆమెపేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ ద్వారా, కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్లు నాగచైతన్య , సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్నీ, దర్శకుల్నీ పరిచయం చేశారు.
అయితే నాగేశ్వర రావు గారికి ఉన్న" నాగ " సెంటిమెంట్ పాజిటివ్ పలితాలు ఇచ్చిందనే చెప్పాలి. అయన తన సంతానం లో ఒక కుమారుడు పేరు నాగార్జున కాగా , కుమార్తె పేరు నాగ సుశీల . అలాగే నాగార్జున గారి కుమారుడి పేరు కూడా నాగ చైతన్యయే . అక్కినేని నాగేశ్వర రావు గారి తర్వాత ప్రజలలో మళ్లి అంత పాపులారిటి సంపాదించిన వారు కుమారుడు నాగార్జున మరియు మనుమడు నాగ చైతన్యయె కావడం గమనార్హం . మిగతా వారు వీరంతా పాపులార్టి పర్సన్స్ కాదు. కాబట్టి నాగేశ్వర రావు గారి నమక్కాన్ని "నాగ దేవుడు" లేక నాగ దేవత వమ్ము చెయలెదు.అని చెప్పవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు 91 సంవత్సరాల వయసులో 22-1-2014న మరణించారు. అయన గారి ఆత్మకు శాంతి కలగాలని అ దేవ దేవుణ్ణి ప్రార్దిస్తున్నాను.
"మడిసన్నాకా కూసింత కళా పోసనే కాదు , కాస్తంత దైవ బక్తి కూడా ఉంటే లాబమే కాని , నష్టం ఏమి లేదు" అని అక్కినేని గారి కుటుంబాన్ని చూస్తె తెలియడమ్లా ?
(24/1/2014 Post Republished).
No comments:
Post a Comment