Tuesday, September 13, 2016

"కదిరి" నరసింహుడే "వీరబోగ వసంత రాయలా"?

                                                                    
  బ్రహ్మం గారు తన కాలజ్ణాణంలో తాను "వీరబోగ వసంత రాయలు" గా యుగాంతం లో వస్తానని చెప్పే మాట చాల ఆశ్చర్యం కలిగిస్తుంది.అసలు ఆ ప్రత్యేకమయిన పేరును ఎందుకు ప్రస్తావించారు అనేది కూడ ఊహకు అందనిదే. ఒకానొక పరిశీలనానుసారం ఆంద్రప్రదేశ్ లొని,కదిరి పట్టణం లో వేంచేసి ఉన్న "శ్రీ లక్ష్మి నరసింహా స్వామి " నే వీరబోగ వసంత రాయలు అంటారట. ఒక వేళా అది నిజమే అయితే ఆ స్వామి పేరునే ఎందుకు చెప్పారు అనేది కూడ ఆలోచించవలశిన విషయమే.

  "కదిరి" అంటే ఒక చెట్టు పేరు. దీనినే మనం "సండ్ర చెట్టు" అంటాం. ఈ చెట్లు అదికంగా ఉన్న ప్రాంతం కాబట్టే "కదిరి" పట్టణానికి ఆ పేరు వచ్చింది. మరి "వీరభొగవసంత రాయుడు"  రావటానికి ఈ ’సండ్ర" చెట్లకు ఏమయిన సంబందం ఉందా? లేక రాబోయే అవతార పురుషుడికి "సండ్ర" చెట్లు కి ఏమయినా సంబందం ఉందా అనేది కూడ పరిసోదించాల్శిన విషయమే.ఇంకొక చోట బ్రహ్మం గారు "వేదాల" స్తానం లో "సాంద్ర సిందు వేదం" నిలుస్తుంది అంటారు.దీని గురించి తర్వాతి టపాలో చెపుతాను.

  నరసింహ స్వామికి రాబోయే మన్వంతరంలో ’ఇంద్రుడు" కాబోయే ’బలి చక్రవర్తి" కి ఉన్న సంబందం చూద్దాం.హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ’నరసింహ స్వామి" ప్రహ్లాదుని చక్రవర్తిగా చేసి అతని వంశం వారిని చంపనని వరమిస్తాడట!  కాని ఆ తర్వాత వచ్చిన "వామన" అవతారంలో "ప్రహ్లాదుని" మనుమడయిన "బలి చక్రవర్తి" ని పాతాళానికి తొక్కి వేశినట్లు పురాణం లో చెప్ప బడింది. ఇది ఇంచు మించు చంపడం క్రిందికే వస్తుంది. తిరిగి రాబోయే "మన్వంతరం" లో ’బలి చక్రవర్తినే" "ఇంద్రుడు" గా నియమించాలి అంటే అది ఆ "నరసింహ" శక్తికి తప్ప అన్యులకు అలవి కాదు.కాబట్టే బ్రహ్మం గారు నరసింహ స్వామిని ద్రుష్టిలో పెట్టుకునే " వీరబోగ వసంత రాయలు" పేరు చెప్పి ఉండవచ్చు.

  ఇకపోతే నరసింహ స్వామికి "కల్కి" కి ఉన్న లింక్ గూర్చి తెలుసుకోవడానికి ఈ లింఖ్ ని క్లిక్ చెయ్యగలరు.
                     http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_8576.html

                                         ( 10/12/2012 Post Republished).

2 comments:

  1. sir, i have very interesting information .please contact me 9505221122

    ReplyDelete
    Replies
    1. pl,sent such information to my email Ad."yugaanta@gmail.com.thank you.

      Delete