Wednesday, September 28, 2016

అమ్మా! ఈ నలబై యేళ్ళుగా నేను లైంగిక దోపిడికి గురవుతూనే ఉన్నాను!


                                                                 
                                                               

 రోజూ ఉదయం ఆరు ఇంటికి వచ్చే పనిమనిషి "రాములమ్మ" రాలేదు. నాకు చచ్చేంత విసుగ్గా ఉంది. రాములమ్మ పనికి కుదిరిన దగ్గర్నుంచి, నాకు చాలా  పని బారం తగ్గి సుఖానికి అలవాటు పడటం వలన ,ఒక్క రోజు పని మనిషి రాకపోయినా న గుండేల్లో రైళ్లు పరుగెడ్తూ ఉంటాయి. టైం ఏడు అయింది. ఇక ఈ రోజు రాములమ్మ రాదని నిర్ణయించుకుని మనసుకి సర్ది చెప్పికి ఒళ్లు ఒంచాను.

 ఈసురో మంటూ పనులన్నీ అయిపోయాయి అనిపించేసరికి పన్నేండు అయింది. ఇక కోంచం నడుం వాలుద్దామని మంచం మీద పడుకున్నానో లేదో, బయట తలుపు కొట్టిన చప్పుడు అయి, చిరాకుగా వెళ్ళి తలుపు తీసాను. ఎదురుగా రాములమ్మ!

  ఒక్క సారిగా అరచినంత పని చేసాను"ఏమైంది రాములమ్మ? పొద్దునే రాలేదు"

  "అన్యాయం అయిపోయానమ్మా" ఒక్క సారిగా నన్ను కావలించుకుని ఘొల్లు మంది రాములమ్మ.

  "ఏమైంది రాములమ్మా" మనసెందుకో కీడు శంకిస్తుంటే అడిగాను.

  "అయ్యో నన్నాడు  నలబై  యేండ్లుగా  దోపిడి చెస్తుండటమ్మా" బోరుమంది

 రాములమ్మా.

 అదిరి పడ్దాను  నేను. "ఎవడే వాడు" కోపంగా అడిగాను.

 ఇంకెవడూ , నా మొగుడే.

 ఏమిటీ? నీ మొగుడా? అనుమానంగా అడిగాను.

  అవునమ్మా ఆడే,అని తలచుకుని తలచుకుని ఏడవ సాగింది రాములమ్మ.

  రాములమ్మ ఏడుపు వెనకాల  ఏదో పెద్ద కదే ఉందనిపించింది. నెమ్మదిగా ఆమెను కూర్చోబెట్టి బోజనం పెట్టాను. తిన్న తర్వాత అసలు ఏమి జరిగిందో చెప్ప మన్నాను. ఆమె చెప్పినది విన్న తర్వాత నాకు నోట మాట రాలేదు. అలాగే మ్రాన్పడి పోయాను. రాములమ్మ తెల్లారి టైం కి వస్తాను అని చెప్పి వెళ్ళి పోయింది. ఇంతకీ ఆమె చెప్పిన విషయం ఏమీటంటే,

  రాములమ్మకు చిన్న తనంలోనే పెండ్లి సంబందం వచ్చింది.  ఆమె మొగుడు భద్రయ్య కొంచం చదువుకోవటమే కాక గడుగ్గాయి గా  పేరు పడిన  కుర్రాడు. అందుకు రాములమ్మని ఇవ్వడానికి తల్లితండ్రులు సందేహిస్తుంటే, మద్య వర్తి" అమ్మాయి యుక్తవయస్కురాలు అయ్యాకే  పెండ్లి చెద్దాం. ముందు పప్పన్నాలు తినండి. ఒక వేళ పెండ్లి నాటికి మీకు ఇష్తం లేక పోతే అప్పుడే సంబందం కాన్సిల్ చేసుకోవచ్చు, మీ రెండు కుటుంబాలు కలిస్తే ఇద్దరికి మంచిగుంటుంది. ఆ పైన మీ ఇష్టం".అంటే సరే అని సంబందం కుదుర్చు కున్నారట. ఆ తర్వాత రాములమ్మ యుక్త వయస్కురాలవడం, ఆ పైన ఏ అబ్యంతరం లేకుండా వారి పెండ్లి జరగటం అయిపోయాయి. ఆ తర్వాత అందరి సంసారాల మల్లేనే అప్పుడప్పుడు కీచులాడుకోవడం, అలిగి పుట్టిటీంటికి వెళ్ళడం, బ్రతిమాలో, పెద్దల జ్యోక్యంతోనో  తిర్గి కాపురానికి రావడం, ఇలా గడుస్తూనే ముగ్గురు బిడ్డల తల్లి అయింది రాములమ్మ.

  నిజానికి రాములమ్మకు పని చేసి పొట్ట పోసుకోవలసిన అవసరం లేదు. పెడ్ద అబ్బయి కాలరీస్ లో పని చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. తక్కిన ఇద్దరు ఆడపిల్లలకు పెండ్లిల్లు అయి వారి మొగ్గుల్లతో చక్క గా కాపురం చేసుకుంటున్నారు. కొడుకు కూడా తల్లితండ్రులకు నెల నెలా ఖర్చులకి సరి పోను పంపిస్తున్నా, రాములమ్మే కోడుకు కి తెలియకుండా మా ఇంటిలో పని చేస్తుందట. రాములమ్మ మొగుడికి ఇప్పుడు అరవైఅయిడేళ్లు. ఇంటి దగ్గరే ఉంటాడు.

  ఈ మద్య రాములమ్మ ఉండే కాలనీలోని ఆడాళ్లందరికి కలిపి ఒక సంఘం పెట్టారట. ఆ సంఘం లో ఆడాళ్ళ హక్కులు, ఆడోళ్ళు మీద మొగుళ్ళు చేసే దౌర్జన్యాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలిపారట! వారందరిలో ఒకామె చెప్పిన ఉపన్యాసం రాములమ్మని ఆలోచనలో పడేసిందట. ఆమె చెప్పిన దాని ప్రకారం "ఆడదానికి దేనిలోను స్వాతంత్ర్యం లేదు. అన్నిటీ లోను మగాడే జులుం చేసి తన కోరినట్లు ఆడది నడిచేలా చేస్తున్నాడు. చివరకు పడకింట్లో కూడా మాగాడిదే పై చేయట(?). అందుకని అటువంటి సంసారం ఇష్ట పూర్వకంగా చేసినది కాదు కాబట్టి, అది కూడా దోపిడి క్రిందే లెఖ్ఖట!కాబట్టి ఇప్పుడు అటువంటి మొగుళ్ళకి  ఎదురు తిరగాలట, అవసరమైతే విడాకులు ఇవ్వాలట!

 ఇది విన్న తర్వాత రాములమ్మకి తను రోజు మొగుడి క్రింద ఎంత దోపిడికి గురి కాబడిందో తెలిసి గుండే చెరువు అయిందట! ఎంత అవమానం! ఇక ఈ అవమానం భరించడం తన వల్ల కాదట. అందుకే తన ముసలి మొగుడికి విడాకులు ఇద్దామని పెద్దమనుషులు పంచాయితి పెడితే, కాలనీ స్త్రీల సంఘం ఒత్తిడితో కాలనీలోని పెద్ద మనుషులు విడాకులు ఇప్పిస్తాను అని ఒప్పుకున్నాడట. దానికి రాములమ్మ మొగుడు తన కొడుకు ఇచ్చే డబ్బులతో ఎలాగో బ్రకుతాను అంటే దానికి రాములమ్మ తరపు వారు ఒప్పుకోలెదట. ఇన్నాళ్ళు రాములమ్మని దోచుకుందే కాక, ఇప్పుడు రాములమ్మ కొడుకు డబ్బులు దోచుకోవడానికి ముసలాడు కుట్ర పన్నాడు అని అన్నారట. పంచాయితీ వచ్చే వారం కి వాయిదా వేసారట. అందుకే రాములమ్మ ఈ రోజు పని లోకి రాలేదట. అదీ రాములమ్మ మొగుడి  నలబై యేండ్ల దోపిడి కద.

 ఆమె కద వింటుంటే నాకెక్కడో ఇలాంటి కదే ఈ మద్య విన్నట్లు ఉంది, ఎక్కడబ్బా? అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను.          
                                                                                                                                                                    (28/9/2013 Post Republished).                      



No comments:

Post a Comment