మొత్తానికి సంచలన నిర్ణయాలు ప్రకటీంచడంలో కె.సి.అర్. గారికి ఉన్న దమ్ము ఎవరికి ఉండదనుకుంటా! సాంప్రాదాయ పార్టీలైన వారెవ్వరికి అసలు ఈ ఆలోచన కూడ వచ్చి ఉండదు. ప్రబుత్వం ఖజానా నుండి ఒక్క రూపాయి కూడ దేవాలయాలకు ఇవ్వనవసరం లేకుండా, దొడ్డి దారిలో దేవుడి సొమ్మును ప్రభుత్వ శాఖలకు,రాజకీయ అవసరాలకు వినియోగించుకునేందుకు ఒక"వర ప్రసాదిని" లా ఉపాయోగ పడుతున్న హిందూ దేవాదాయ మంత్రిత్వ శాఖను రద్దు చెయ్యాలంటే ఎంత సాహసం ఉండాలి?
దీని వల్ల దేవాదాయ వనరుల మీద పూర్తీగా హిందూ మతానికి చెందిన సంస్తలు స్వయం ప్రతిపత్తి తో కూడిన ఆజమాయిషి కలిగి ఉండి, పూర్తిగా స్వాతంత్రం పొందుతాయి. దేవాలయ వ్యవస్త కు స్వర్ణ యుగం అంటే కాకతీయుల కాలమనే చెప్ప వచ్చు. ఆ రోజుల్లో దేవాలయ "బాంక్" లు రైతులకు సైతం అప్పులిచ్చేటంత ఆర్థిక స్వయం సమ్రుద్ది కలిగి ఉండేవట. దిక్కు మాలిన నైజాం ప్రబుత్వం వచ్చాకే వాటికి దుర్దశ మొదలై, ఇప్పటి పాలకుల చేతిలో పూర్తిగా నాశనం అయిందని చెప్ప వచ్చు. ఊరిలో పని పాట లేకుండా తిరిగే బలాదూర్ గాళ్ళు,ఏ మాత్రం నైతిక చింతన లేని వాళ్ళు, దేవాలయాలకు దర్మకర్తలుగా చేసిన పాపం ఈ సర్కార్ కి ఉంది. ఇక పూర్తీగా అవినీతి మయమైన దుస్తితి నుంచి తప్పించడానికి ఆ శాక రద్దు ఒకటే తక్షణ కర్తవ్యం. సరి అయిన నియంత్రణ కొరకు ఒక స్వయం ప్రతిపత్తితో కూడిన సంస్త ఉంటే చాలు. పైసా ఇవ్వని ప్రభుత్వ నియంత్రణ అనవసరం.
ఈ విషయం లో సాహసోపేత నిర్ణయం తీసుకున్న తెలంగాణా రాష్ట్ర సమితికి,కె.సి.అర్ గారికి,హిందూ సంస్తలు అభినందనలు తెలపాల్శిన అవసరం ఉంది.