సామాజిక సైట్ అయిన ఫేస్ బుక్ పిచ్చి పిల్లలను ఎంత ప్రమాదకరమైన పనులు చేయిస్తుందో ఐ క్రింది విడియో లింక్ ను చూస్తె తెలుస్తుంది. ఆడపిల్లలు ఏమో "నేను బాగున్నానా " అని కామెంట్ల కోసం పోటోలు పెడుతూ, అపరాచితులకు తమ అందాలు ప్రదర్శిస్తుంటే , మగ పిల్లలు ఏమో తమ వీరత్వాన్నీ ప్రదర్శిస్తూ, ప్రమాదకరమైన ఫీట్లు సెల్ పోన్ ద్వారా చిత్రీకరించి మరీ ఫేస్ బుక్ లో పెడుతున్నారు. ఇటువంటి చేష్టలను నియంత్రించడానికి తగిన నియమ నిబందనలు త్వరగా ఏర్పాటు చేయకపోతే ఈ పిచ్చి ముదిరి పాకాన పడేటట్లుంది.
మైనర్ లు సెల్ పోన్ లు ఉపయోగించకుండ చట్టం చేస్తే ఎలా ఉంటుంది? ఒక వేళ సెల్ ఇచ్చిన కేవలం ఒక నంబర్ కు మాత్రమే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ ఉండే సెల్ లు మాత్రమే ఉపయోగించలి. అంతే కాక ఎట్టి పరిస్తితిలో మైనర్ ల సెల్ లకు నెట్ కనెక్షన్ ఉండ కూడదు. అటువంటి సెల్ లను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పే అధికారం పబ్లిక్ కి ఉండాలి . అంటే మైనర్ లు నిషేదిత సెల్ లను ఉపయోగించడాన్ని "కాగ్నిజబుల్ అపెన్స్ " గా గుర్తించాలి. ఇలా చేస్తే కొంత నియంత్రణా భయం ఉంటుంది అనుకుంటా!
ఫేస్బుక్ లో లైకుల కోసం పిల్లలు చేసిన ఆ ప్రమాదకర ఫీటు కోసం క్రింది విడియో లింక్ ను చూడండి