Showing posts with label రాజకీయ నిర్ణయాధికారం. Show all posts
Showing posts with label రాజకీయ నిర్ణయాధికారం. Show all posts

Monday, September 23, 2013

ప్రభుత్వ ఉద్యోగులు చేతిలో రాజకీయ నిర్ణయాధికారం!


                                                                     
                                                    

 ఆటు కోదండ రాం గారు అయినా, ఇటు అశోక్ బాబు గారైనా ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే!. అటు తెలంగాణా J.A.C.   కి కోదండరామ్ గారు సారద్యం వహిస్తుంటే, ప్రస్తుతం రాజకీయ నాయకులు బిక్క చచ్చి ఉన్న తరుణం లో సీమాంద్రలో  సకల జనుల ఉద్యమానికి సారద్యం వహిస్తున్న ఆశోక్ బాబు గారు కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఇక వారికి సహకరిస్తున్న విద్యార్దులు కానీ, ఉద్యోగులు కానీ అటూ, ఇటూ కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంటే జీతాల కొరకో, స్కాలర్షిప్పుల కొరకో ప్రభుత్వ సొమ్ము మీద ఆదార పడిన వారే. అంటే ఇది పూర్తిగా ప్రభుత్వ స్పాన్సర్డ్ ఆందోళన అని అనవచ్చా?

  ఇన్నాళ్ళు సమ్మె చేస్తే కోదండరామ్ గారిని ఏమనలేని ప్రభుత్వO, ఏ ప్రభుత్వ ఉద్యోగిని ఏమనలేక పోవచ్చు. మొగల్ చక్రవర్తులను ఎదిరించి, తెలుగు నాడుకు ఉద్యోగులైన నిజాములే పాలకులైన చరిత్ర మనది.  మరి ఆ చరిత్రయే పునరావ్రుతం కానుందా? అని నా  సందేహం.

  ఇంకొక  సందేహం ఏమిటంటే హైద్రాబాద్ ని U.T చేస్తే అటు తెలంగాణా  ప్రజలలో తిరుగుబాటు వచ్చే ప్రమాదం లేకుండా ఉద్యమ నాయకత్వాన్ని ఉద్దేశ్య పూర్వకంగనే కోదండ రామ్ చేతిలో ఉంచి, ప్రభుత్వానికి అనుకూలం గా ఉండేటట్లు ఏర్పాటు చేసారా? అలాగే సీమాంద్రలో అశోక్ బాబు నాయకత్వంలో మొదట సమైఖ్య వాదంతో ప్రారంభించి చివరకు హైద్రాబాద్  U.T  ప్రతిపాదనతో ప్రజలు చల్లబడేలా చెయ్యడానికి ప్లాన్ చేసారా? అటూ, ఇటూ ఉద్యోగులే కదం తొక్కుతుంటే తెల్ల ముఖాలు వేసుకుని రాజకీయ నాయకులు కాలు కాలిన పిల్లిలా డిల్లీలో తిరగడం ఏమిటి?

  నిజంగా చిత్త శుద్ది ఉంటే అటు కోదండ రామ్ కానీ, ఇటు అశోక్ బాఉ కాని హైద్రాబాద్ ని U.T   చెయ్యడానికి ఒప్పుకోకుండా ఉండాలి.ఉంటారా? చూద్దాం.ప్రభుత్వ ఉద్యోగులు పట్ల ప్రభుత్వ ఉపేక్ష వెనుకాల ఉన్న మతలబ్ ఏమిటో?