Friday, September 16, 2016

బ్రహ్మం గారు చెప్పిన "చంద్రగుప్త మహరాజు","చంద్ర బాబు నాయుడు"గారేనా!?

                                                                  
మిత్రులారా "కల్కి" అవతార పురుషుడి గురించి నా పరిశొదనా కొనసాగుతుంది. ఈ లోపు ఇతర బవిష్యాలు గురించి తెలియ చెపుతాను. నేను మొదటగా చెప్పినట్లు, నేను చెప్పేదంతా  బవిష్య గ్రంథాలలో ఉన్న దానికి నా పరిశీలనా అంశాలు జోడించి మీ ముందుంచటం జరుగుతుంది.అవి నిజాలా ?కావా?అన్నది కాలానికి వదిలేద్దాం.నమ్మే వారు నమ్మవచ్చు.లేనివారు లైట్ తీసుకుని హాయిగా నవ్వుకోవచ్చు.

                                                                        

  ఇక విషయానికి వస్తే బ్రహ్మం గారి కాలజ్ణానం లో ఒక చోట"కల్కి అవతారుడి వలన "పచ్చ బండ" రూపం లో ఉన్న చంద్రగుప్త మహరాజుకు శాప విమోచనం కలుగును" అని చెపుతారు.ఇది కల్కి అవతారం రావడానికి నాందిగా ఉంటుందని కూడ చెపుతారు.

 ఇది చదవిన నాకు చాలా ఆశ్చ్చర్యం వేసింది. ఎప్పుడొ గతించిన "చంద్రగుప్త మహారాజు"కలియుగాంతానికి ఎలా వస్టాడు అనే అనుమానం ఒకటి కాగా,ఆయన "పచ్చ బండ రూపం" లో ఉండటం ఏమిటి? అనేది రెండవది. దీని మీద లోతుగా పరిశిలిస్తే ఒక విషయం ఫ్లాష్ లైట్ లా వెలిగింది!

                                                                             
                                                                           
"చంద్ర గుప్త మహారాజు" అంటే "నారా చంద్రబాబు నాయుడు"గారు అయ్యుండాలి.పచ్చ బండ రూపం అంటే "తెలుగు దేశం" పార్టి అయ్యూండాలి(జెండా రంగు పసుపే కదా). మరి శాప విమోచనం అంటే ఏమిటి?.గత కొన్ని యేళ్లుగా ఆయన అధికారంలో లేడు కదా!. ఇది ఆయనకు దేవుడు ఇచ్చిన శాపమని దివంగత ముక్యమంత్రి అనేక సందర్బాలలో అన్నారు. కాబట్టి ఈ సారి ఎన్నికలలో "కల్కి అవతార పురుషుడు" వలన తిరిగి చంద్ర బాబు నాయుడు గారు అదికార పగ్గాలు చేపట్ట బోతున్నారా?! ఈ విషయమే బ్రహ్మం గారు తన కాలజ్ణానం లో చెప్పారా?చూద్దాం ఏమి జరుగబోతుందో?      

  Note: ఈ  టపా 2012 లో నవంబర్ 14 న రాయబడింది. ఈ  టపాలో  చెప్పినట్లే  2014 లో చంద్రబాబు గారు ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టడమే కాక , ఎంతో చారిత్రిక ప్రసిద్ధం కాబోతున్న "అమరావతి " అనే రాజధాని నిర్మాణానికి నాంది పలకటం వలన చారిత్రిక పురుషుడు కాబోతున్నాడు.

3 comments:

  1. థాంక్స్ హేమ గారు.

    ReplyDelete
  2. Really very happy to say,your post is very interesting to read.I never stop myself to say something about it.You’re doing a great job.Keep it 

    idhatri - this site also provide most trending and latest articles

    ReplyDelete