కొంత మంది విజ్ఞాన వాదులు కొన్ని విషయాలు గురించి వివరిస్తూ ఉపమానాలు చెపుతున్నారు . వారు చెప్పే విషయం గురించి పెద్దగా అబ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు కాని , వారు చూపే పోలికలు చూస్తుంటే వారిలో ఎ మాత్రం జ్ఞానం ఉందొ యిట్టె అర్ధం అవుతుంది . ఉదాహరణకు మొన్న గుంటూర్ లో తల్లి తండ్రులు తమ కన్నా కూతురిని తమ అనుమతి లేకుండా , తమను మోసం చేసి వివాహం చేసుకుందనే కోపంతో ఆమెను దారుణంగా చమ్పారు. దీనికి యావత్ ప్రజలు, చివరికి వారి బందువులు కూడా తీవ్రo గా ఖండించడం జరిగింది .
అయితే పై కేసులో అమ్మాయిని చంపటానికి "కులం" కంటే ఆర్దిక కారణాలే ఎక్కువ ప్రబావం చూపాయి . దిని గురించి వివరంగా తెలుసుకోవాలంటే http://ssmanavu.blogspot.in/2014/03/blog-post_24.html ని క్లిక్ చెయ్యండి . అయితే కొంతమంది మనదంతా ఒకే కులం అని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు చూపిస్తున్నారు . దానిలో "రక్తం " ఉదాహరణ ఒకటి . పైనున్న బొమ్మ చూసారు కదా ! పేస్ బుక్ లో కొంత మంది మిత్రులు పోస్ట్ చేసారు దాన్ని . కొన్ని దశాబ్దాలుగా ఈ ఉదాహరణ తో ప్రజలలో "కులం" గురించి ఉన్న అపోహలు తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు . ఒక్కప్పుడు దిని ని కరక్టే అనుకున్నారేమో కాని , విజ్ఞానం పెరిగాక ఈ ఉదాహరణ వాళ్ళ మనుషులు అంతా ఒకటి కాదు అనే బావమే బల పడుతుంది . అదెలాగో చూదాం .
మనుషులలో లేక భారతీయులలో కులాలు మాదిరిగానే రక్తం లో గ్రూపులు ఉన్నాయి . కులాలు చూసుకోకుండా వివాహాలు చేసుకున్నా ఏమి జరుగదు కాని , గ్రూపులు చూడకుండా ఒకరి రక్తం మరొకరికి ఎకిస్తే మాత్రం ఎగిరి చచ్చె అవకాశ ముంది . కులంలో కొంతైనా కాంప్రమైజ్ ఉంటుందేమో కాని , రక్తంలో మాత్రం "నో కాంప్రమైజ్ " . అందు చేత మనుషులంతా ఒకటే అని చెప్పడానికి "రక్తం" ఉదాహరణ పనికి రాదు . మనుషులంతా వేరు వేరు అని చెప్పడానికి మాత్రం బేషుగ్గా పనికి వస్తుంది