Showing posts with label తొందర పడి ముందే కూస్తున్న సిమాంద్ర కోయిలలు. Show all posts
Showing posts with label తొందర పడి ముందే కూస్తున్న సిమాంద్ర కోయిలలు. Show all posts

Friday, February 7, 2014

టెన్షన్ తో తొందర పడి ముందే కూస్తున్న సిమాంద్ర కోయిలలు !

                                                                 
                                                         

దేనికైనా ఒక టైం  ఉంటుంది . అది అ టైం  ప్రకారమే జరుగుతుంది . వసంతకాలం లో కోయిలలు కూస్తాయి ,అంతే కాని కోయిల కూసింది కదా అని వసంత కాలం రాదు . వసంత కాలం రాకుండా కూసే కోయిల కూతలు తొందరపడి కూసేవే అవుతుంది . ఇదే విషయాన్ని రెండవ సారి మన సుప్రీం కోర్టు  వారు సిమాంద్ర నాయకుల పక్షానా వాదనలు వినిపించిన సుప్రీం కోర్టు న్యాయవాదులకు చెపుతూ, వారు దాఖలు చేసిన రాష్ట్ర విభజన మిద పీటిషన్లు ను సున్నితంగా తిరస్కరించారు .

  4 రోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర విభజన ను చాలెంజ్ చేస్తూ సిమాo ద్రకు చెందిన వారు 9 పిటిషన్ లు వేసారు . గతంలో ఇలాగే వెయ్యగా అవి అపరిపక్వమైనవని , అసెంబ్లీ తీర్మానం కాని , కేంద్ర ప్రబుత్వ నిర్ణయం కాని జరుగకుండా వాటి మిద విచారణ జరపటం తొందరపాటు చర్య అవుతుందని కోర్టు వారు పెటిషన్ లను తిరస్కరించారు . ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం అయి పోయింది . విభజన బిల్ టెక్నికల్ గా తిరాస్కారానికి గురి అయిo ది . అయినా సరే రాష్ట్ర విబజనకే  కంకణం కట్టుకున్నట్లు కేంద్రం తెగ యాక్షన్ చేస్తుంటే , టెన్షన్ పెంచుకున్న సిమాంద్ర నాయకులు కొందరు తిరిగి చాలెంజ్ పిటిషన్ లు వేస్తె కోర్టు వారు గంటన్నర వాదనలు విన్నాక , గతంలో పిటిషన్ లకు ప్రస్తుతం వేసిన పిటిషన్ లకు పెద్ద తేడా లేదని పెదవి విరచి ఈ రోజు తిరస్కరించారు

  కాకపొతే సమైక్యతా కోరుకునే వారికి ఉన్న ఒక్క ఆశ  ఏమిటంటే , పిటిషన్లు తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు వారు అన్న మాటలు . " కేంద్ర ప్రబుత్వం నిర్ణయం ఏమిటో తెలియకుండా పిటిషన్లు విచారించడం తొoదర పాటు చర్య అవుతుoది. కాబట్టి సరి అయిన సమయంలో వేస్తె పరిశిలించవచ్చు " అంది . అంటే కేంద్రం రాజ్యంగా ప్రకారం రాష్ట్ర విభజన చెయ్యడానికి ఇంకా అవకాశం  ఉంది అని సుప్రీం కోర్టు వారి అభిప్రాయం కావచ్చు. అది నిజమే . రాజ్యంగా బద్దంగా విభజన చెయ్యడానికి కేంద్ర ప్రబుత్వానికి ఆవకాశం  ఉంది . కానీ టైమే  లేదు . కాంగ్రెస్ వారు చెయ్యాలంటే ఇప్పుడున్న రూపంలోనే మమా అనిపించాలి .దానిని కోర్టువారు అడ్డుకునే ఆవకాశం  కూడా లేకపోలేదు . ఈ రోజు కోర్టువారు అన్న చివరి మాటలు అదే అభిప్రాయం కలిగిస్తున్నాయి . ఒక వేలా కోర్టులకు ఆ చాన్స్ ఇవ్వద్దు అనుకుంటే రాష్ట్ర విభజన బాద్యతను రాబోయే ప్రబుత్వానికి వదిలెయ్యాలి .అది కాంగ్రెస్ కి కష్టమైనా పనే . అందుకే డ్రామాలకు తేర తీసింది . చూదాం ఏమి జరుగుద్దో!