నిన్న ఒక మిత్రుడి బ్లాగులో ఒక లేడి యాంకర్ ని పొగుడుతూ రాసిన పోస్ట్ చూసి కొంత అశ్చ్యర్యం వేసింది . కారణం అప్పటి దాక ఆ యాంకర్ ని "అప్ట్రాల్" అనుకున్న అ బ్లాగ్ మిత్రుడు ఆమె పాడిన ఒకే ఒక పాట లాంటిది విని , చలించి పోయి ఆమెను గారూ" అని సంబోదిమ్చడమే కాక ఆమెను ఒక ఉద్యమ వెలుగు గా అభివర్ణిస్తూ ఆకాశానికి ఎత్తేశాడు. నాకైతే తెలుగు సినిమా కదే గుర్తుకు వచ్చింది .
సినిమా మొదట్లో అల్లరి చిలరి గా తిరుగుతూ దొంగ తనాలు చేసే హిరోయిన్ ని చూసి అసహ్య హించుకునే హిరో , ఒక సందర్బంలో ఆమె సమాజం లోని దుర్నితి గురించి లెక్చర్ దంచితే కంగుతిని ఆమె అరాదకుడు అయిన హిరోగారి కద లాగా ఉంది అయన చెప్పింది . ఏదైనా సరే అప్పటి దాక ఆమె యాంకరింగ్ అంటే ఆయనకి వెగటు పుట్టిoదట! కాని ఒక్క పాటతో 'వెగటు ' కాస్త ఆరాధ్యo గా మారి అభిమానం 'గారు " తుంది !. ఇంతకీ ఆమెగారు పాడింది చూదాం .
గంగ గరుడాలెత్తుకెళ్ళేరా.. ఇంక ఆంబోతులాట సాగేరా..
ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కండ్లు సూడు
భూమి బుగ్గై పోయె.. సూడు బొంద గడ్డల జోరు సూడు..
ఎవ్వారొ…
ఎవ్వారొ ముద్దు బిడ్డలు రా… ఎందుకనొ పరుగెట్టినారురా..
ఎవ్వారొ ముద్దు బిడ్డాలెందుకనొ పరుగెట్టినారురా..
ఎవ్వారొ ముద్దు బిడ్డలెందుకనొ పరుగెట్టినారు
ఎర్రనీ మడుగుల్ల మునిగి ముద్దలాయె ముద్దు బిడ్డల్
బోరు బోరు గా గండమోర్లు వెట్టి కుండే వలిగె జల్లులు
ఈ కడుపుకోతల నార్పెదెవ్వరురా
ఆ కలుపు మొక్కల కాల్చెదెవ్వడురా
రాకాసి బల్లులంతా రాజ్యమేలే రాజులంటా -2
రావణాసురులంత జేరి రోజుకొక్కా రచ్చ పెడితే..
పంట చీడను మట్టుపెట్టే పురుగు మందుల విందులాయె–2
ఎంత నెత్తురు ఏరులై నెవ్వాని దూప తీరదాయే
జాలి జూపర జంగమయ్యా జాగిలాలా జాతరాపర.. -2
కొండ దిగిరా కొమూరన్నా కొండముచ్చుల కోర్కెదీర్పర..
రెండు పూటల్ పస్తులుండీ నిండు ప్రాణాలెన్నొ మింగె -2
గోండ్రు కప్పలు గుంట నక్కలు కాకికూత కోడెనాగులు ..
గద్దె కొరకే గాడ్దికొడుకుల్ గత్తారాలేపేరురా
ఇది మారీచులాటరా నువ్ మర్మమెరుగర పామర –2
ఆడు తెస్తడొ, ఈడు తెస్తడు
అవ్వ ఇస్తదొ అయ్య తెస్తడొ -2
ఎవ్వడిచ్చెదేందిరా ఇది ఎవ్వనీ జాగీరురా.. -2
నీకు నువ్వే రాజురా నిన్నేలెటోడింకెవడురా-2
గంగ గరుడాలెత్తుకెళ్ళేరా ..ఇంక ఆంబోతులాట సాగేరా
ఎండినా దుక్కుల్ల సూడు, ఎన్నడెండని కన్ను సూడు
భూమి బుగ్గై పోయె సూడు బొంద గడ్డల జోరు సూడు..
గంగ గరుడా… గంగ గరుడాలెత్తుకెళ్ళేరా
పై పాటలో అండర్ లైన్ చేసిన దానిని గురించి చెప్పాలంటే అసలు పదవుల కొరకు నిచ రాజకీయాలు చెయ్యడం నేర్పింది ఎవరు? తమకు పదవులు రాలేదని , హైదరాబాద్ ని మత కల్లోల నగరంగా మార్చి , పట్ట పగలు హత్యలు చేయించిన గాడిద కొడుకులు ఎవరు ?వారే ఇప్పుడు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం "తెలంగాణ " చిచ్చు పెట్టారు . అది కాస్తా రాజుకుని ప్రజలలో వేర్పాటు బావాలు రగిలిస్తే , ఇప్పుడేమో "గద్దె కోసం గాడిదలు " చేస్తున్న రాజకీయం అంటున్నారు .అసలు నిజం చెప్పాలంటే "గద్దె నాశించ కుండ గాడిద చాకిరి చేసే వారెవరు ?
మనం గత అరవై ఏండ్లుగా "ఇండో చైనా స్సాంస్క్రుతిక సంబందాలు"ఇండో రష్యా స్సాంస్క్రుతిక సంబందాలు"ఇండియన్అమెరికా స్సాంస్క్రుతిక సంబందాలు" అని ఇతర దేశాల ప్రజలతో స్నేహ బావం పెంచుకోవడానికి కృషి చేసారు కాని ఆంద్రా,తెలంగాణా ప్రజల మద్య ఆత్మీయ సంబందాలు నెలకొల్పడానికి ఎ చర్యలు అయినా చేపట్టారా? ఇప్పటికి చాల మంది ఆంద్రా ప్రజలుకి తెలంగాణా వాలంతే చులకన బావం ఉందనేది కఠిన సత్యమ్. అదే నేడు తెలంగాణా వారు వేర్పాటు వాదాన్ని కోరుకునేలా చేస్తుంది . తెలంగాణా వచ్చి బ్రతికే వారు కూడా , తెలంగాణా ప్రజలను చిన్న చూపు చూస్తుంటే ఎవరు మాత్రం సహిస్తారు? ఏ మాత్రం అవకాసం దొరికిన వారిలో ఉన్న ఆక్రోశం వెల్ల గ్రక్కుతారు . అదే ప్రస్తుతం తెలంగాణా ప్రజలు చేస్తుంది . వారికి కె.సి.ఆర్ రూపం లో అవకాశం దొరికింది . ఉపయోగించుకుని విదిపోవాలను కుంటున్నారు . ఏ ఆశ లేకుండా చాకిరి చేసే గాడిదలు కాని, వాటి కొడుకులు కాని ,రెచ్చగొత్తె పాటలు పాడే వారికి , వారితో పాడించే వారికి ఆదర్శo కావచ్చు !. తెలంగాణా వారికి మాత్రం ఆత్మ గౌరవం కాపాడే వాడు గద్దె నాసించిన తప్పు లేదని రేపు జరగబోయే ఎన్నికలలో తీర్పు చెప్పనున్నారు . అయినా విచిత్రం కాకపొతే ఒక్క పాటకే "యాంకర్ " ఉద్యమ కారిణి అయితే, వందల పాటలు పాడిన నిజమైన ఉద్యమ కారులుని నేమంటారు? "యాంకర్లు " అంటారా ?!రేటింగ్ ఆర్టిస్టులు అంటారా !