ఈ మద్య ఆడవారి మీద అత్యాచారాలు ఎకువుగా జరగటానికి కారణాల్లో ఇంటర్నేట్లో పోర్న్ సైట్ల ప్రదర్శన ఎక్కువ కావటం కూడా ఒకటి. ఈ రోజుల్లో పదేళ్ల పిల్లవాడి దగ్గర్నుంచి ముసల్లోళ్ళ దాక ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఉంటుంది. ఇంటర్నెట్ పుణ్యామాని,అరచేతిలో స్వర్గాలు చూసే అవకాశం కుర్రకారుకు కలుగుతుంది. ఏదైనా చదువు ద్యాసమీద పడి బుద్దిగా చదువుకునే పిల్లలు ఉంటే ఓ.కె. కానీ అటు సరి అయిన చదువు లేక, చదువుకున్న చదువుకు ఉద్యోగాలు దొరకక ఖాళీగా ఉండే యువతకు వ్యాపకంగా మరేది స్నేహాలు. ఆ స్నేహితులు కూడా ఉడుకు రక్తం వారే కాబట్టి వారి ద్యాస అంత వారికీ వేడెక్కించే విషయాల మీదే ఉంటుంది. వారిని మరింత చెడగొట్టడానికి ఇంటర్నేట్ లో విచ్చలవిడిగా , అతి జుగుప్సా కరంగా ఉండే బూతు సైట్లు కారణమవుతున్నాయి. వాటిని చూసిన వారికి స్త్రీలందరు వారి కోరికలు తీర్చడానికి పనికి వచ్చే వారిగానే కనిపిస్తారు.
అసలే కోతి, ఆ పై కల్లు తాగింది అన్నట్లు వయసు వేడి ని రెచ్చగొట్టె అవకాశం అరచేతిలో ఉన్న కుర్ర కారు కొంచం సంపాదనా పరులైతే వారి కోరికలు తీర్చడానికి "వీది బొమ్మలు" చాలా మంది ఉన్నరు. మరి అలాంటి వారితో తిరగడానికి అలవాటు పడ్డ వారికి స్త్రీల మీద సద్బావన ఎలా ఉంటుంది? పూర్వ కాలంలో "వేశ్యా వాటికలు " అనేవి ఉండేవి అట !ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాలు కొన్ని నగరాల్లో ఉండవచ్చు .కానీ చీకటి వ్యాపారాలు ఈ రోజుల్లో ఎక్కువుగా జరుగుతున్నాయి. దీనికి ప్రదాన కారణం అధికారుల రాజకీయ నాయకుల అండ. అలా వ్యవస్త బ్రష్టు పట్టి పోవడానికి ,యువత చెడిపోవడానికి ఇన్ని అవకాశాలు ఉన్న సమాజంలో మార్పు రావాలంటే ఎలా వస్తుంది? ఎవరు తెస్తారు?
కొంచం జాగర్తగా ఉండాలి స్త్రీలు అంటే "స్త్రీ వాదులు" ఒప్పుకోరు. ఉరి లాంటి కఠిన శిక్షలు ఉండాలంటే వాటితో నేరాలు తగ్గుతాయా అని పెదవి విరుస్తారు, ఆమ్నెస్టీ సానుబూతి పరులు. మరి ఏమిటి పరిష్కారం అంటే అన్నిటికి ప్రభుత్వం దే బాద్యత అంటారు. మంచిది. అవ్వా, బువ్వా రెండూ కావలంటే కష్టం . ఆడపిల్లలకు రక్షణ కావాలంటే కొన్ని కఠిన నియంత్రణ పద్దతులు అవలంబించి పైన చెప్పిన వన్నీ కట్టడి చేసి తీరాల్సీందే. లేదంటే స్త్రీలను చెరపట్టె దుష్ట రాక్షస సంస్క్రుతి వర్దిల్లుతుంది.