ఈ రోజుల్లో నిజం ఏదో, అబద్దం ఏదో తెలియకుండా పోతుంది.ఒక వ్యక్తి కి అన్యాయం జరిగి కేసు పెడితే, సదరు కేసును నీరు కార్చడానికి వేంటనే "కౌంటర్ కేసు" పెట్టేస్తున్నారు. దీనికి కావాల్సింది వెరీ సింపుల్.ఒక ఇద్దరు తప్పుడు సాక్షులు ఉంటే చాలు.దీని వలన నిజమైన బాదితులు కూడ తప్పుడు కేసు హింస తట్టుకోలేక రాజీకి రావాల్సిన దౌర్బాగ్య పరిస్తితులు ఏర్పడుతున్నాయి.
ఈ విదానానికి ఆద్యులు, ప్రోత్సాహ కర్తలు రాజకీయ పార్టీలే. ఎడుటిపార్టీలొని వారిలో నేరానికి సంబదం లేని వ్యక్తులినా సరే తమకు అడ్డంకిగా ఉన్నారని బావిస్తే వారిని కేసుల్లో ఇరికించడం, అది చూసి ఇవతలిపార్టివారు కూడ అదే పని చెయ్యడం చివరకు రెండు వర్గాల వారు రాజి పడ్డడం, కేసు కొట్టివెయ్యడం, ఈ విదంగా మన న్యాయ ప్రక్రియనే బ్రష్టు పట్టిస్తున్నారు. ఈ ప్రహసనంలో అటు పోలిస్ వారికి ఇటు న్యాయవాదులకు డబ్బు బాగానే ముడుతుంది కాబట్టి అందరూ తలొక చేయి వేసి ఈ విదానాన్ని ప్రోత్సాహిస్తున్నారు.
ఇలా రాను రాను ఈ విదానం వేశ్యా వ్రుత్తి చేపట్టిన అమ్మాయిలకు కొంతమందికి లాబసాటి వ్యాపారంగా మారింది. అబ్బాయిలను ఆకర్షించడం, వారితో అన్ని కార్యక్రమాలు కాన్నిచేసి, తీరిగ్గా వారి మీద కేసులు పెట్టడం, చివరకు లక్షలు గుంజి కాంప్రమైజ్ కావడం, ఇలా వేల రూపాయల కు బదులు లక్షల రూపాయలను వారి బిజినెస్ లో పొందడం జరుగుతుంది. దీనిని కూడ పోలిస్ లు తమకు నజరాణాలు బారీగ ముడుతున్నందు వల్ల ప్రోత్సాహిస్తున్నారు. అక్కడక్కడ నీతి పరులు ఉన్నారు. వారికి మాత్రం మినాహాయింపు.
అందుకే ఏ కటిన చట్టం అమలులోకి వచ్చిన, ఈ తప్పుడు కేసులు విదానం వల్ల నీరుకారి పోతున్నాయి. చివరకు బార్యబర్తల మద్య కెసులు పరిష్కరించే" గ్రుహ హింస" చట్టం కూడ ఈ విదానానికి మినాయింపు కాదు. ఈ విషయం లో తప్పుడు కేసుల నిరోదానికి కటిన విదానం ఉంటే తప్పా ఇది ఇలాగే కొనసాగుతు మన వ్యవస్తనే తప్పుడు వ్యవస్తగా మారుస్తుంది.
"సత్యమేవ జయతే’ అన్న అధికార చిహ్నం కల్గిన మనం ఇటువంటీ అబద్దపు వ్యవస్తను కొనసాగించడం సిగ్గుచేటు. మొన్న చేసిన "నిర్బయ" చట్టం ఆశయం కూడ ఈ ప్రక్రియలవల్ల నీరుకారక మానదు. ఈ మద్యనే జరిగిన ఒక సంఘటన దీనికి మంచి ఉదాహరణ . పూర్తి సమాచరం కొరకు లింక్ మీద క్లిక్ చెయ్యండి http://kalkiavataar.blogspot.in/2013/04/blog-post.html