నేను ఇందాక ఒక బ్లాగులో రాయలసీమ యాసలో "బేట్రాయి సామి దేవుడా " అన్న మకుటంతో ఉన్న జానపద పాట చూసాను . చాలా బాగుంది .దశవతార వర్ణన వారి మాండలికంలో చక్కగా కూర్చారు . నేను కవిని కాను . ఆ సంగతి నాకు తెలుసు . కాని కదిరి నరసింహుడి ఉద్దేశించి పాడిన ఆ జానపదం చూసాక నాక్కూడా ఎదో ఒకటి ఆ స్వామీ ని అడగాలనిపించి ఇలా అడిగాను (రాసాను ).బాగున్నా ,బాగోకున్నా లైట్ తీసుకోండి నేను ఇంతకు ముందు "కదిరి" నరసింహుడే "వీరబోగ వసంత రాయలా"? అని ఒక టపా పెట్టాను . ఇంట్రస్ట్ ఉంటే లింక్ చూడండి
http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_10.html
బేగి రా సామి దేవుడా -మమ్ము కాపాడ
బేగి రా సామి దేవుడా
కల్కీ అవతారుడా !కదరి నరసింహుడా
జల్దీగా వస్తువని నమ్మి నేనుంటిరా I బే I
సరాజ్యం వచ్చెనని -అంతా మనదేనని
అయిద్రబాద్ కొస్తిమి
అరవై యేండ్లు గడచినాక ,నీది గాదు
జాగాoటే నేనేడ బోదురో ! I బే I
వెనుక ముందు కానక _ఒక్క చోట కూడ బెట్టి
నడమంత్రపు నగరి చేస్తే ,
నట్ట నడుమ లొల్లి ఎంది ,బిస్తర్తో
బిచాణా లేప మంటురేందిరో I బే I
తన్నులు తన్నిన నవాబుని తాత అనబట్టే ,
తమ్ముడైన నన్ను, కాదు పొమ్మన బట్టే ,
తెలుగోడు ,తెలుగోడు ఒకటి కాదన బట్టే
తెలుగు తెల్యనోడిని బాయి బాయి అనబట్టే I బే I
ఇంగ్లిషోడి కాలంలో కల్సి బ్రతకలెకపొయే ,
తెలుగోడి పాలనలో తంపులతో విడిపోతే ,
ఎప్పటికైనా మన బతుకింతేనా ,ఇంటి కుక్క ,
ఇంటి కుక్క ... అన్న చందానా .... I బే I
http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_10.html
బేగి రా సామి దేవుడా -మమ్ము కాపాడ
బేగి రా సామి దేవుడా
కల్కీ అవతారుడా !కదరి నరసింహుడా
జల్దీగా వస్తువని నమ్మి నేనుంటిరా I బే I
సరాజ్యం వచ్చెనని -అంతా మనదేనని
అయిద్రబాద్ కొస్తిమి
అరవై యేండ్లు గడచినాక ,నీది గాదు
జాగాoటే నేనేడ బోదురో ! I బే I
వెనుక ముందు కానక _ఒక్క చోట కూడ బెట్టి
నడమంత్రపు నగరి చేస్తే ,
నట్ట నడుమ లొల్లి ఎంది ,బిస్తర్తో
బిచాణా లేప మంటురేందిరో I బే I
తన్నులు తన్నిన నవాబుని తాత అనబట్టే ,
తమ్ముడైన నన్ను, కాదు పొమ్మన బట్టే ,
తెలుగోడు ,తెలుగోడు ఒకటి కాదన బట్టే
తెలుగు తెల్యనోడిని బాయి బాయి అనబట్టే I బే I
ఇంగ్లిషోడి కాలంలో కల్సి బ్రతకలెకపొయే ,
తెలుగోడి పాలనలో తంపులతో విడిపోతే ,
ఎప్పటికైనా మన బతుకింతేనా ,ఇంటి కుక్క ,
ఇంటి కుక్క ... అన్న చందానా .... I బే I