Showing posts with label కలేజా ముఖ్యమంత్రి. Show all posts
Showing posts with label కలేజా ముఖ్యమంత్రి. Show all posts

Sunday, May 19, 2013

నొప్పించక, తానొవ్వక, కళంకితులను తప్పించిన కలేజా ముఖ్యమంత్రి!

                                                           
                                                              

  ఎందుకో మన ముఖ్యమంత్రి గారిని చూస్తే, కలేజా ఉన్న ముఖ్యమంత్రే అనిపిస్తుంది. ఆయనకి, హంగూ ఆర్బాటం, పిచ్చి మాస్ ఫాలోయింగ్ లేకపోయినా కొంచం చట్ట పరిదిలో తన పరిదిని, ప్రజల పట్ల నిబద్దతని గ్రహించి మెలుగుతున్న నాయకుడు అనిపిస్తుంది.

  ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, ఈయనకి ఏం చూసి అధిష్టానం ముఖ్య మంత్రి పదవి కట్టబెట్టిందబ్బా! అని ఆలోచించించారు అటు  నాయకులు ఇటు ప్రజలు. ఆయన పెద్ద అవినీతి సామ్రాట్ అని ముద్రపడిన వాడు కాదు కాబట్టి, పైసల్ సంపాదించడం చేతకాని వాడికి పదవెందుకు అని పెదవి విరచిన వారూ ఉన్నారు.ఒక పక్క తెలంగాణా పేరుతో ప్రాంతీయ సెగలను బూచిగా చూపించి పదవులు పొందాలని ఆరాటపడుతున్న వ్రుద్ద నాయకులు, ఇంకొక పక్క ఆఫ్త్రాల్ మా అవినీతి సామ్రాజ్యానికి ఎవడయినా తల వంచాల్సిందే అని అంగబలం, అర్థబలం చూపి బయపెడుతున్న జగన్నాటక సూత్రదారులను ఎలా కట్టడి చేస్తాడని డిల్లీ పెద్దలు, ఆలోచించారో ఎవరికి అర్థం కాలేదు. తుమ్మితే ఊడిపోయే ముక్కనే అందరూ అనుకున్నారు.కాని తాను అందరూ అనుకున్నట్లు కాదని నల్లారి వారు రుజువు చేస్తున్నారు.

  అధిష్టాన దేవతను సంత్రుప్తి పరచడానికి రోడ్డు మీద ధర్ణా చేసి, ముఖ్యమంత్రి స్తాయిని దిగజార్చిన, మాజీల వలే అత్యంత దూర్త వినయం ప్రదర్సీంశింపలేదు. అలా అని అసలు అధిష్టానాన్ని "సీమ దొర" ల వలే బేఖాతరు చెయ్యలేదు. ఒక ప్రక్క ప్రతిపక్షాల దాడులను సమర్థంగా తిప్పి కొడుతూనే, మరొక వంక పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్న వారి బరతం పట్టడం మొదలెట్టారు.సి.బి.ఐ. చార్జ్ షీట్ మంత్రులను ఒక పక్క వెనకేసుకు వచ్చినట్లు అనిపిస్తూనే, కేంద్ర మంత్రులకు ఒక న్యాయం, రాష్ట్ర మంత్రులకు ఒక న్యాయం పాడి కాదని,అదిష్టానం బావిస్తున్నట్లు, సదరు మంత్రులను ఒప్పించి వారి లాంచన రాజీనామాలను లక్షనంగా ఆమోదింపచేసిన ఘనాపాటి నల్లారి బిడ్డ అని చెప్పక తప్పదు.

  అవినీతి డబ్బుతో, అహంకారంతో విర్రవీగే నాయకులు కాదు ఇప్పుడు ప్రజలకు కావాల్సింది. కనీసం తాము చేస్తున్న చట్టాలకు విలువిచ్చి, అవి వాటి పని అవి చేసుకు పోయేలా చూడగలిగిన సౌమ్యులైన నాయకులు చాలు మనకి. ఆ లక్షణాలు  మన ముఖ్య మంత్రి గారిలో పుష్కలంగా ఉన్నాయనే  అనుకుందాం.

  మేము ఇంతకు ముందు టపాలో "కేంద్ర మంత్రులు కంటే    మన మంత్రులు చాలా పవర్పుల్లా"http://kalkiavataar.blogspot.in/2013/05/blog-post_14.html అని అడిగాము. కాదు చట్టం ముందు అందరూ సమానమనే నిరూపించిన ముఖ్య మంత్రి గారికి దన్య వాదములు తెల్పుతూ...  " కల్కి ఖడ్గం"