Showing posts with label మంత్రి పదవి. Show all posts
Showing posts with label మంత్రి పదవి. Show all posts

Tuesday, June 4, 2013

పంచె "గోచీ" ఊడబీకినంత ఈజీగా ఊడబీకే "పదవి" ఏదో తెలుసా?


                                                                   
                                                              

  ఇంకేది "మంత్రి" పదవే మరి! పాపం మన  గారు మంత్రి హోదాలో విదేశాల కెళ్ళారా! "మాజీ మంత్రి " హోదాలో స్వదేసాన్కి రావాల్శి వచ్చింది! ఇంత కంటే అన్యాయం ఉంటుందా. కనీసం అటెండర్ పోస్ట్ ఊడబీకాలన్న "నెలరోజుల" ముందు నోటీస్ ఇవ్వాలే, ఆ పాటి చెయ్యదా ?" మంత్రి"  పదవి!  ఇంతోటి పదవి చూసుకునా వీరంతా ఎగెరెగిరెగిరి పడేది.  పదవి కోసమా అధినేత ల చుట్టూ ప్రదక్షిణాలు చేసేది? దీని మీద నాకొక చిన్న డౌట్ వచ్చింది, ఆదేమిటంటే,

  మొన్న మన మంత్రి గారు వేరే దేశమేదో వెళ్ల్లారు కదా, సపోజ్, పర్ సపోజ్, అక్కడ వారికి ఏదైనా ఒక సన్మాన కార్యక్రమమ్ జరుగుతుందనుకుందాం.అప్పుడు అక్కడ నిర్వాహకులు వారిని ఆంద్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖా
మంత్రి గా ఉన్నా రెడ్డి గారిని వేదిక మీదకు అహ్వానించి సన్మానం చేస్తున్న సమయం లోనే, ఇక్కడ ఒక్క మాట కూడ చెప్పకుండా ఆయన గారి మంత్రి పదవి పీకేసారనుకోండి! ఏమిటి పరిస్తితి? స్టేజ్ ఎక్కేటప్పుడు మంత్రిగా ఉన్న వాడు స్టేజ్ దిగేటప్పుడు మాజీ గా మారిపోయాడు అంటే ఇంతకంటె నగుబాటు ఉంటుందా? గుండే పోటు వచ్చినట్లు వస్తుంద వైద్య ఆరోగ్య శాఖా మంత్రి గారికి "మంత్రి పోటు" అనేది! ఎంత ముఖ్యమంత్రి గారి ఇష్టం అయితే మాత్రం "పంచె గోచి" ఊడబీకినంత ఈజీ గా పీకేస్తారా "మంత్రి " పదవిని? పంచె గోచి అయినా బాజారులో ఊడపీకరు,ఇంటికెల్లో, చాటుకెళ్ళొ పీకుతారు, పాపం మన మంత్రి గారికి ఆ గౌరవం కూడా ఇవ్వకపాయే! విదేశాలో ఉండగనే పీకీ పారేసే!

   ఏమో ఎవరికెరుకా? సదరు మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా ఎక్కెదెక్కడా ఏమేమీ పీకారో? అందుకే ఆయన ఇలా చెప్పా పెట్టకుండా పీకీ పారేసి, కసి తీర్చుకున్నారనుకుంటా!