అంద్రాకి తెలంగాణాకి అభివ్రుద్దిలో ఏ మాత్రం విచక్షణ చూపించటం లేదు, మాకందరు సమానమే, అన్ని ప్రాంతాలు సమానమే, అని పాలకులు చెపుతుంటే, చెవిలో పువ్వులు పెట్టుకుని, నోట్లో వేళ్లు వేసుకుని వినే వారు వింటుంటారు. మాకు ప్రాంతీయ బేదాబావాలేమి లేవు, డబ్బున్నవారైతే చాలు, ఏ ప్రాంతం వారికైనా పనులు చేస్తాము అంటే అది కరక్టే అని నమ్మవచ్చు. ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే ఈ మద్య medicine రాంకులు వచ్చాయి. పేపర్లలో ఏ రాంకుకు ఎక్కడ సీటు వస్తుంది అని అంచనా వేసుకోవడానికి పోయిన సంవత్సరం లాస్ట్ రాంక్ లిస్ట్ కాలేజీల వారిగా ఇచ్చారు. అవి పరిశిలించిన నాకు ఎందుకో తెలంగాణా విద్యార్దులకు బోల్డంతా అన్యాయం జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది అనిపిస్తుంది. ఇది నిజమా? కాదా? చెప్పండి. ముందు పైనున్న రాంకుల లిస్ట్ గమనించండి.
తెలంగాణా ప్రాంతం (లాస్ట్ కటాప్ మార్కులు). అంద్రా ప్రాంతం
బాలురు బాలికలు బాలురు బాలికలు
(1) ఓపెన్ కేటగిరి 1090 749 1495 1357
1796 1728 2032 2097
(2) బి.సి A కేటగిరి 4849 4150 5502 4390
6570 6489 6816 6747
(3). బి.సి Bకేటగిరి 2168 1837 4813 4157
3445 3414 5682 5674
(4) బి.సి C కేటగిరి 2907 2733 2110 2519
4373 4628 3516 3521
(5) బి.సి D కేటగిరి 2103 2123 2323 2077
3095 3224 3487 3410
(6). బి.సి E కేటగిరి 3204 3085 7935 8299
4718 4863 8114 8954
(7).ఎస్.సి.కేటగిరి 5197 4837 6741 6867
7764 7549 8884 8910
(8)ఎస్.టి కేటగిరి 4254 3836 10363 10003
6430 6029 12533 12878
పై కేటగిరిలలో మొదటి వరస ప్రబుత్వ వైద్య కళాశాలలో కటాఫ్ మార్కులు కాగా, రెండవ వరుస ప్రివేట్ (ఏ) కేటగిరి లో కటాప్ మార్కులు తెలుపుతున్నాయి. పై లిస్ట్ పరిశిలించినపుడు ఓపెన్ కేటగిరే కాకుండా బి.సి.(బి),ఎస్.సి., ఎస్.టి , బి.సి (ఇ) కేటగిరి విద్యార్దులకు సంబందించి, తెలంగాణా, ఆంద్రా ప్రాంతం లలో చాలా వ్యత్యాసం ఉంది.ఇందులో రాయల సీమ ప్రాంతం కలుపలేదు. పది జిల్లాలు ఉన్న తెలంగాణాకి నాలుగు ప్రబుత్వ వైద్య కళాశాలలు ఉంటే, తొమ్మిది జిల్లాలు ఉన్న, కోస్తాంద్రకు అయిదు ప్రబుత్వ కళాశాలలు ఉండటం, మొత్తం మీద తెలంగాణా కంటే, కోస్తాంద్ర వారికి సుమారు మూడు వందల సీట్లు దాక ఎక్కువ ఉండటం ఈ రాంకుల వ్యత్యాసానికి కారణం . దీని వలన తక్కువ రాంక్ వచ్చిన తెలంగాణా విద్యార్ది సీటు పొందలేక పోతుంటే, రెట్టింపు రాంక్ వచ్చిన కోస్తాంద్ర ప్రాంత విద్యార్దులు వైద్య కళాశాలలొ సీట్లు సంపాదించి, డాక్టర్లు కాగలుగుతున్నారు. ఇంత కంటే వేరే సాక్ష్యాలు కావాలా? తెలంగాణా విద్యార్ది లోకం వివక్షతకు గురిఅవుతుంది అని చెప్పటానికి.ఇలాంటి పరిస్తితి దాపురించబట్టే, తెలంగాణా విద్యార్దులు "జై తెలంగాణా" అంటూ ప్రత్యేక తెలంఘానా కోరుకుంటున్నారు.వారి డిమాండును కాదనే నైతిక హక్కు ఎవరికి లేదు.
ప్రబుత్వాలు అనేవి ప్రజల వెనుక బాటు తనమే కాదు, ప్రాంతాల మద్య సమతుల్యం పాటించి, పాలన చేయకపోతే తప్పకుండా ఏర్పాటు వాదాలు తల ఎత్తుతాయి . ఇది చారిత్రక సత్యం . పైన తెలిపిన వైద్య సీట్ల పంపకం తెలంగాణా వివక్షతకు ఒక మచ్చుతునక మాత్రమే.ఇదే తరహా లో అన్ని రంగాలోనో జరిగింది. దీనిని తక్షణమే సరి చెయ్యాల్సిన అవసరం ఉంది.