Showing posts with label బ్లాగుల్లో లో అజ్ఞాత. Show all posts
Showing posts with label బ్లాగుల్లో లో అజ్ఞాత. Show all posts

Thursday, November 14, 2013

బ్లాగుల్లో గీత: పోస్టు లు పెట్టు వీరెవరు ? కామెంటులు పెట్టు వారెవ్వరు?!

                                                     

 ఈ  మద్య  కొన్ని బ్లాగులను నిశితంగా గమనిస్తే, ఒక విషయం బోదపడుతుంది. ఆ బ్లాగుల్లో పోస్టు పెట్టిన వారు  కానీ, వారి సంబదీకులు కానీ నాలుగైదు కామెంట్లు , సదరు బ్లాగు పోస్టులోని విషయానికి వ్యతిరేకంగా , లేక అనుకూలంగా పెడుతూ వీక్షకులను రెచ్చగొట్తీ  తమ బ్లాగు టపా వైపు ఆకర్షింప బడేలా చేస్తున్నారు అనిపిస్తుంది. మరి ఇటువంటి వాటికి పేరులు వేర్వేరు గా ఉండాలి కదా అంటే అవసరం లేదు. అందరిని ఆదుకునే ఆ "అజ్ఞాత " వ్యాఖ్యాత వీరికి సహాయం చేస్తుంటాడు. అజ్ఞాత పేరుతో చిన్నా ,పెద్దా , మంచి మర్యాద లేకుండా నానా బూతులు తిడుతూ  తమ అసహ్యకర దోరణిని బయట పెట్టుకుంటారు .

  ఒక విషయం మీద అనేక రకాల అభిప్రాయాలు ఉండవచు. ఉండాలి కూడా . అలాగే ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించవచ్చు. విబేదించవచ్చు. దీనికి వేరే బాష ప్రయోగించాల్సిన  అవసరం కానీ, తమ లోని కుసంస్కారన్ని తెలిపే విదంగా పద ప్రయోగం చేయవలసిన అవసరం ఏముంది? సంస్కారమైన  పదజాలంతోనే తమ లోని నిరసన స్తాయిని ప్రతిద్వనించేలా చేయవచ్చు. అలా చేయాలంటే ముందు మనలో సంస్కారం ఉండాలి. మన సంస్కారం ఏమిటో పదిమందికి తెలియ చేయటానికి మన అసలు పేరో, కలం పేరుతోనో బ్లాగుల్లో పోస్టులు , కామెంట్లు పెట్టే దమ్మూ , దైర్యమూ ఉండాలి. అంతే కాదు , అలా  దమ్ము దైర్యమూ ఉన్న వారి కామెంట్లనే అనుమంతించాలి. బ్లాగు నిర్వహణ అంటే కేవలం బావ ప్రకటనే కాదు అది సంస్కారవంతైన , పదిమందికి ఆమోద యోగ్యమైన బాషాజాలం తో కూడినది ఉండాలని నా అభి ప్రాయం. ఒక వేళ కాదు , నేను ఇలాగే రాస్తాను అంటే దానికి వేరే "అడల్ట్ " కాటగిరి బ్లాగులు ఉన్నాయి కాబట్టి అందులో చూపించవచ్చు, బాషా నైపుణ్యం.

   ఏది ఏమైనా ఇటువంటి బ్లాగులు తక్కువగానే ఉన్నా వాటిలోని విషయాలు మీద ఏదైనా కామెంట్ చేయాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ఆ తర్వాతి కామెంటర్ చండలకరమైన పదజాలంతో తన అసహనం తెలియ చేస్తే? దానిని బ్లాగర్ అనుమతిస్తారు కాబట్టి, అలాంటి బ్లాగుల్లో కామెంట్ లు పెట్టక పోవడమే మంచిది అనిపిస్తుంది. కాబట్టి ఈ  విషయం లో సహా బ్లాగర్లు ఆలోచిస్తారని ఆశ . అంతే !.