Showing posts with label తండ్రి మిద పగ. Show all posts
Showing posts with label తండ్రి మిద పగ. Show all posts

Sunday, October 20, 2013

చిన్నప్పుడు తనను పట్టించుకోలేదని , పెద్దయినాక తండ్రి ని రోడ్డు మీద వదిలేసినోడిని ఏమనాలి?



                                                          
  


అతని పేరు బత్తుల రాజేంద్ర ప్రసాద్.ఊరు ఆదిలాబాద్ జిల్లా ,కొటాలం మండలం  కన్నేపల్లి గ్రామం  వ్రుత్తి పది మంది కి పాటాలు చెప్పే పంతులు. కానీ చెయ్యరాని పని చేసి రాష్ట్ర ప్రజల దృష్టిలో  కృతఘ్నుడి  గా మిగిలి పోయాడు.

  ఆ పంతులు గారి తండ్రి పేరు ఉపేందర్ . వయస్సు 75 సంవత్సరాలు. అతనికి ఏకైక సంతానం ఐ పంతులు గారు. కానీ ఆ పంతులు గారికి తండ్రి అంటే పడదట! కారణం సదరు ఉపేందర్ తన కొడుకు అయిన ఐ పంతులు గారిని చిన్నప్పుడు నిర్లక్ష్యం చేసాడట. కాబాట్టి చిన్నప్పుడు తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఇప్పుడు సదరు పంతులు గారు 75 యేండ్లు వయసున్న తన తండ్రిని   ఒంటి మీద గుడ్డలు కూడా లేనటువంటి దయనీయ స్తితిలో ఒక రహదారి మీద వదిలేసి వెళ్ళాడట . ఒంటి మీద గుడ్డలు లేకపోవడంతో , సిగ్గుతో చితికి పోయిన ఆ ముసలి తండ్రి , పాపం కాళీడ్చుకుంటు సమీప గ్రామానికి చేరి , అక్కడ ఉన్న ఒక మడుగులోని రెల్లు  దుబ్బుల మధ్యకు వెళ్లి తన మానాన్ని కాపాడుకుంటూ ,అలాగే ఆ మడుగులోని నీటిని త్రాగి తన ప్రాణాల్ని కాపాడుకుంటూ మూడు  రోజులు గడిపాడట. ఆ తర్వాత ఎవరో పశువుల కాపరి చూసి ఆ విషయం గ్రామస్తులకు  చెపితే వారు అతనిని చేర దీసి కూడు ,గుడ్డ ఇచ్చి కొడుకు కి కబురు పంపితే అతడు ఇంటికి తాళం వేసుకుని, ఎటో వెళ్లి పోయాడట. అతని సెల్ కుడా  బంద్  చేసుకున్నాడు. అదీ కద .

   ఇప్పుడు చెప్పండి ఇందులో ఆ కొడుకు అనే వాడికి ఏమైనా మానవత్వం ఉందా? నాగుపాము కైనా పన్నెండెల్లే పగ అంటారే మరి ఆ కొడుకు పాముకి తండ్రి చనిపోయేదాకా పగ చల్లారదా? కూడు  గుడ్డ కోసం తన ఏకైక సంతానమైన కొడుకు మీద ఆదారపడే వయసులో ఆ ముసలి తండ్రిని ప్రతీకారం పేరుతో అనాదను  చెయ్యడం ఎంతవరకు బావ్యం?అతను  టిచర్ . బాగానే సంపాదిస్తున్నాడు. కాబట్టి చట్ట ప్రకారం అయినా తండ్రిని ఆదరించాల్సిన బాద్యత అతనికి ఉంది. కాబట్టి తక్షణం అధికారులు స్పందించి కొడుకు కి కౌన్సిలింగ్ ద్వారా , మాట వినకపోతే చట్ట ప్రకారం అయినా చర్యలు తీసుకొని తండ్రి అయిన దేవబత్తుని ఉపేందర్ కి పోషణ సౌకర్యాలు కల్పించాలీ .