Showing posts with label Brahmam Kalajnanam. Show all posts
Showing posts with label Brahmam Kalajnanam. Show all posts

Wednesday, September 14, 2016

"పంది కడుపున ఏనుగు పుట్టును " అన్న బ్రహ్మం గారి కాలజ్ఞాన వాక్యం నిజమయిందా !!!?

                                   


                                                బవిష్యత్ లో జరుగబోయే దానిని ముందుగానే దర్శించిన మహానీయుల్లో తెలుగు గడ్డ మీద జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారు ఒకరు . 16 వ శతాబ్దానికి చెందిన ఈయన రచించిన "కాలజ్ఞానం "లోని అనేక బవిష్యాలు నిజమయ్యాయి అని అనేక మంది నమ్ముతున్నారు . తాను కలి యుగాంతం నకు వీరబోగ వసంత రాయలు నై వస్తాను అని ,అప్పుడు జరగబోయే కొన్ని వింతలు  వీరబోగ వసంత రాయలు రాకకు గుర్తుగా ఉంటాయని కూడా "కాలజ్ఞానం '" లో చెప్పడం జరిగింది . అలాంటి వింతల్లో 'పంది కడుపున ఏనుగు పుట్టును ' అనేది కూడా ఒకటి . అ వాక్యం వేరే రూపంలో  నిజమయిందా  అని అనిపిస్తుంది "నార్వే'" దేశం లో జరిగిన ఈ వింత జననం చూస్తుంటే .
                                                                   

 నార్వే దేశం లో ని అండర్సన్ ,అలెగ్జాండర్ అనే   దంపతులకు ఒక పిల్లవాడు కలిగాడు . అయితే అ పసివాడు ఏనుగు పిల్ల మాదిరి వింత ఆకారం తో జన్మించడం తో తల్లి తండ్రులు అతనిని ఎవరికీ కనపడకుండా రహస్యంగా ఉంచినప్పటికి ,చివరకు అది బయటకు పొక్కి మిడియా వాళ్ళ చెవిన పడింది అంట . చివరకు ఆ వింత బాలుడిని యూ ట్యూబ్ లో పెట్టె సరికి అందరూ వింతగా చూసినా ,మన దేశం వాళ్ళు మాత్రం సాక్షాత్తు గణేషుని అవతారం అని అంటున్నారు అంట . ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు  లోను బగవంతుని దర్శించే హిందూ జీవన విదానం లోని గొప్పదనం అదే కదా !

కాని నార్వే కు చెందిన ఆ బాలుడి తల్లి తండ్రులు మాటలు వింటుంటె వీరు మనుషులా ? పందులా ? అనిపిస్తుంది . తమకు పుట్టింది "అష్టా వక్రుడు " అయినా తల్లి తండ్రులకు అంతో ఇంతొ మమకారం ఉంటుంది .ఆ కారణం వలననే వికలాంగులు అయిన పిల్లలు భూమి మీద జివించ గలుగుతున్నారు .కాని ఈ చిన్నారి తండ్రి అలెగ్జామ్డర్ తమకు పుట్టింది ఒక క్రీచర్ అని ఈసడించడమె కాక ,ఆ పిల్ల వాడిని 'బేస్ మెంట్ "లో ఉంచి ,రోడ్ల మీద ఏరుకొచ్చిన చెత్త ని అతడికి ఆహారంగా ఇస్తాను అని ,కుదిరితే ఇండియా లో ఎవరికైనా ఇస్తాను అని ,వారైతే ఆ వింత బాలుడిని 'తాజ్ మహల్ " లో పెట్టి చిరంజీవి గా ఉంచుతారని  చాలా అసహ్యంగా మాట్లాడాడు . అలెగ్జాండర్ కు అబ్బిన సైన్స్ విజ్ఞానం అలా అతనిలోని మానవత్వాన్ని చంపి వేసింది అన్న మాట. పిల్లల ఆలనా పాలన పట్టించుకోకుండా తిరిగే తల్లి తండ్రులను "పంది కన్నట్లు కనగానె సరిపోదు 'అని మన పెద్దలు తీడుతుంటారు . అ లెక్కన ఆండర్సన్ దంపతులు పందులు క్రిందే లెఖ్ఖ .

  ఆవిధంగా చూసినపుడు బ్రహ్మం గారు తన కాల జ్ఞానం లో చెప్పిన మాటలు ఇలా నిజమయ్యాయ్యా !? అని అనిపిస్తుంది .