Showing posts with label గీతలో కులం లేదు.. Show all posts
Showing posts with label గీతలో కులం లేదు.. Show all posts

Monday, July 15, 2013

గీతలో "కులం" లేదు. ఉందన్న వారి లోనే "కులతీట" ఉంది.

                                  

                                                                   చదువుకుని కొంత జ్ణానం అబ్బగానే తాము దేనికైనా బాష్యం చెప్పగల పండితులం అనుకునే "పండిత పుత్రులు" చాల మంది ఉన్నారు . వారీలో తమకు ఇష్టం లేని వాటిని బూతద్దంతో శల్య పరీఖ్షలు చేస్తూ, మూల గ్రందాలలో అనకపోయినా , ఎవరో పైత్యపు బాష్యకారుడు అన్నడని దానినే ప్రామాణికంగా తీసుకుని తమ వక్ర బాష్యాలకు ఆధారం గా ఉపయోగిస్తుంటారు.

  నాకు తెలిసినంత వరకు "గీత" లో కుల ప్రస్తావన లేదు. మనిషి జన్మం బట్టి కాక గుణాన్ని బట్టి నాలుగు వర్ణాలు ఉంటాయని శ్రీ క్రిష్ణుడు చెపుతాడు. అలా ఆ గుణాన్ని బట్టే జ్ణానం ఉన్న వారు బ్రాహ్మణులుగాను, పౌరుషం ఉన్నవారు క్షత్రియులు గాను, వ్యాపార ద్రుక్పదం ఉన్న వారు వైశ్యులు గాను, మిగిలిన వారు శూద్రులుగా ను నిర్ణయించబడతారన్నాడు. అసలు గీతాకాలం కంటే ముందే ఈ వర్ణ బావన అప్పట్టి సమాజంలో ఉంది. అప్పుడు మూడు వర్ణాలే ఉండేవి. జ్నానర్జన, రాజ్యరక్షణ చేసే గుణం ఉన్న వారు తప్పా తక్కిన వారంతా వైశ్యులే అనబడే వారు. కాలక్రమేణా వైశ్యులు కూడ వ్యాపార ద్రుక్పదం ఉన్న వారు, నుండి అది లేని సామాన్య గుణం ఉన్న వారిని "శూద్రులుగా" పరిగణించారు.  ఈ వర్గీకరణ చూస్తుంటే "ప్లేటో" ఆదర్శ రాజ్య బావనల కంటే ముందే మన దేశం లో "గీతాకారుడు" అటువంటి బావాలు ప్రబోదించినందుకు మనం ఎంతో గర్వ పడాలి.

  కాని కొంత మంది పండిత పుత్రుల వల్ల  వర్ణం కాస్తా కులాలుగా రూపు చెంది ఈ సమాజాన్ని నాశ్నం చేసాయి. అది ఎలా జరిగిందో నార్ల వెంకటేశ్వర రావు గారి బాష్యంలోనే మీకు చూపిస్తాను.


"శ్రావణ్కు తెలియకపోయినా గీతకు సొంత సమాజశాస్త్రం ఉన్నది. గుణాన్నీ, పనిని బట్టి నాలుగు వర్ణాలూ నేనే సృష్టించానని చెప్పటంలోనే సారాంశం ఉన్నది. నాలుగు వర్ణాల బదులు నాలుగు కులాలని అల్లాడి మహాదేవశాస్త్రి తన అనువాద గ్రంధంలో రాశాడు. (Shankaracharya, The Bhagavadgeetha with the commentary, tr. by Alladi Mahadeva Sastry, 1979) జాన్ డేవిడ్ అనువాదం కూడా నాలుగు కులాల్నే సూచిస్తున్నది. కృష్ణుడు పేర్కొన్న నాల్గు విధాలైన సృష్టి నాలుగు కులాలకు చెందినది. హిందువు కులంలో పుడతాడు, అందులో నివశిస్తాడు, గతిస్తాడు. బ్రతికుండగా పాటించిన కులధర్మాన్ని బట్టే జన్మాంతరం కూడా ఆధారపడి ఉంటుంది. కులవిధానంలో పైకి పోయే అవకాశం లేదు. అదే, వర్గ సమాజంలో కూలివాడి కుమారుడు ఎంత పెద్ద స్థానానికైనా ఎదగవచ్చు" (గీత బోధించే సమాజశాస్త్రమంతా కులపరమైనదే.-16,By late V R Narla Telugu : Innaiah Narisetti).



 పై న చెప్పిన దానిలో నార్ల వారే క్రిష్ణుడు గుణాన్నిబట్టి, పనిని బట్టి నాలుగు వర్ణాలు తాను శ్రుష్టించాడు అని చెప్పినట్లు ఒప్పుకున్నారు. కానీ ఎవరో అల్లాడి మహాదేవశాస్త్రి మరియు జాన్ అనే అనువాదకులు వర్ణం అంటే కులం అని అనువదించారు కాబట్టి అది కులమేనని తీర్మానించారు. ఇంతకంటే వక్ర బాష్యం  ఇంకోటి ఉంటుందా?

      తనకు హిందూ మతమన్నా, దేవుళ్లు అన్నా, హిందువులు పవిత్రంగా బావించే గీత అన్నా పడదు కాబట్టి ఎవరో పైత్యపు అనువాదకులు చెప్పింది వారి   వక్రబాష్యానికి  అనుకూలం గా  ఉందని దానిని ప్రామాణికంగా తీసుకోవటం చూస్తుంటే ఆయన రచనలలో ఉన్న నిజాయితి ఎంతో ఇట్టే తెలిసిపోతుంది ఎవరికైనా.కాబట్టి కులం అనేది క్రిష్ణుడు చెప్పిన గీతలో లేదు. గీతకు వక్ర బాష్యాలు చీప్పే వారి  లోనే కులతీట  ఉంది అని ఘంటాపధంగా చెప్పవచ్చు