ఒక నాడు తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన రాజశేఖరరెడ్డిగారి తనయుడనే అభిమానంతో, తెలంగాణా కీ చెందిన ఆడబిడ్డ, తనకు గల మంత్రి పదవిని త్రుణప్రాయంగా ఎంచి రాజీనామా చేసి, ఏ పదవి లేకుండా ఆ అన్న(తమ్ముడు ), లాంటి వాడిని నమ్ముకున్నందుకు ఏమి జరిగింది? నట్టేట్లో మునిగినట్లైంది.
ఆయన మాట తప్పని, మడమ తిప్పని వంశాంకురంఅట! ప్రజల సొమ్ము అయితే లక్షల కోట్లు కాజేసి చేతనైతే నేరాన్ని నిరూపించండి అని భారత అత్యున్నత పరిశోధనా సంస్తను చాలెంజ్ చేసిన ఘనుడు అతను. అలాంటి వ్యక్తికి, తనను నమ్మి మంత్రి పదవిని సైతం త్యాగం చేసి వచ్చిన చెల్లికి ఏమిచ్చిన్నా తక్కువే. కానీ అలా చేయకుండా చెల్లేలికి పదవుల మీద నమ్మక్కం లేకపోయినా, తనకు మాత్రమ్ పదవే పరమార్దమని, దాని కోసం కన్న తండ్రి చనిపోయిన కొద్దిగంటలకే తన తండ్రి సీటు కోసం ప్రయత్నించానని, అలాంటి తనకు సెంటిమెంట్ కోసం చెల్లెలు లాంతి దానిని వదులుకోవటం పెద్ద సమస్య కాదని తేల్చేశాడు.
మాట తప్పడం,మడమ తిప్పడం ఆ కుటుబానికి తెలుసో తెలియదో కాని, పదవుల కోసం ఎంత కష్టమైన పడే శ్రమజీవులు వారు. అన్న జైలుకి వెళ్ళగానే పార్టీ ప్రచార బాద్యతను తన స్వంత చెల్లికి అప్పచెప్పాడు కాని, తన కోసం మంత్రి పదవిని వదులుకున్న వ్యక్తి, విషయ్యాన్ని కుండబద్దలు కొట్టేలా చెప్పగల దైర్యవంతురాలు, రాజకీయ అనుభవం ఉన్న ఆ చెల్లి లాంటి వ్యక్తికి అప్ప చెప్ప లేక పోయాడు. అదీ తనను నమ్మిన వారిమీద ఆయనకున్న నమ్మఖ్ఖం. అలాంటి వాడిని నమ్మీ సీమంద్రా ప్రజలు జే జే లు కొడుతున్నారు.నమ్మి, మంత్రి పదవి వదలి వచ్చిన ఆమెనే నట్టేట ముంచిన వాడు, రేపు సీమాంద్రులను ముంచడని గ్యారంటీ ఏమిటి? పాపం సీమాంద్రులు!
మీకెవరికైనా, ఆయనగారి గురించి తెలుసుకోవాలనుకుంటే, "శ్రీ మతి కోండా సురేఖా, మాజీ మంత్రి, తెలంగాణా ఆడబిడ్డ "గారిని అడగండి,అన్నీ వివరాలు తెలుస్తాయి