మీరెప్పుడైన N.T.R గారి ద్వితీయ కళత్రం లక్ష్మి పార్వతి గారి మాటలు విన్నారా? N.T.R గారి కుమారులను గురించి ప్రస్తావించేటప్పుడు మా పెద్ద బాబు, బాలయ్య బాబు అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. కాని వారెవ్వరూ ఆమెను "పిన్ని" అని కాని, అమ్మా అని కాని పిలిచినట్లు ఎక్కడా కనపడ లేదు. కుటుంబంతా రామారావు గారిని అనాదగా వదలిన సంకట పరిస్తితుల్లో, లక్ష్మీపార్వతి గారు ఆ ముసలాయనకి అండగా నిలచి, తోడుగా మారారని అనుకుంటుంటారు. నిజా నిజాలు ఎలా ఉన్నా, రామరావు గారి అవసానదశ మాత్రం లక్ష్మీపార్వతి గారి సహచర్యంలో గడచిందనేది ఎవరూ కాదనలేని వాస్తవం.
మరి అటువంటి లక్ష్మీపార్వతి గారిని పార్లమెంటులో N.T.R గారి విగ్రావిష్కరణకు పిలవకపోవడమేమిటి?. ఒక వేళా లగడపాటి గారన్నట్లు, పార్లమెంటులో పెట్టే విగ్రహావిష్కరణకు ఎవరినీ పిలిచే సాంప్రదాయం లేదన్నప్పుడు, గారి తిరస్కారానికి గురి అయిన, చంద్రబాబు నాయుడు గారిని ఎలా పిలిచారు? పాపం లక్ష్మీ పార్వతి గారికి వెనుక కోట్లు లేవనేగా ఆమెను పట్టించుకోవపోవడం? తనను అవసానదశ ఆదుకున్న ఆ ప్రేమ మూర్తిని కాదని, ఆయనను నిర్లక్ష్యం చేసిన వారందరిని పిలవడం ఆయన ఆత్మకు శాంతినిస్తుందా? ఆలోచించండి.
అదే ఆమే పార్టీ కనుక బలంగా ఉండి, ఆమె వెనుక కోట్ల సొమ్ములు ఉంటే, ఆమెను ఆహ్వానించకుండా ఉండేవారా? ఏది ఏమైనా ఆమే చట్టప్రకారం ఆయన బార్య,కాబట్టి, మర్యాద కోసమయినా ఆమెను ఆహ్వానించడం దర్మం.
ఇన్నాళ్ళకు తెలుగువారి ఆరాద్య నాయకుడు, అభిమాన నటుడు అయిన శ్రీ శ్రీ శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహం బారత పార్లమెంటులో ప్రతిష్టింపబడటం తెలుగువారిగా మనందరకు సంతోషదాయకమే కాక గర్వకారణం కూడా!.