ఈ రోజు రధ సప్తమి అంటే సూర్య జయంతి .భూమి మీద సంవత్సర కాలాన్ని రెండు సమ బాగాలుగా విభజించి ఉత్తరాయణం , దక్షిణాయనం అని వ్యవహరిస్తుంటారు . సూర్యుడు భూమధ్య రేఖ నుండి కర్కట రేఖకు , కర్కట రేఖ నుండి తిరిగి బూమాద్య రేఖ మీదుగా మకర రేఖకు, ప్రయాణించి తిరిగి భూమధ్య రేఖకు చేరుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది . దిని గురించి వివరంగా క్రింది విడియోలో చూడవచ్చు .
సూర్యుడు భూమధ్య రేఖ నుండి కర్కట రేఖ వైపు ప్రయాణించే కాలం మార్చ్ 22 నుండి మొదలవుతుంది . అ రోజునే ప్రదమాంద్ర పాలకుడు , శక పురుషుడు శాలివాహన చక్రవర్తి జన్మించిన దినo . దానినే ప్రామాణికంగా తీసుకుని మన జాతీయ కాలెండర్ రూపొందించారు . అలాగే జులై 23 నుంచి దక్షిణాయన కాలం ప్రారంబం అవుతుoది . అలా దక్షిణాన ఉన్న మకర రాసి వరకు జనవరి 20 వరకు ప్రయాణించి తిరిగి 21 తారీకు నుండి ఉత్తరo వైపు మరలటం జరుగుతుంది . దీనినే ఉత్తరాయణం అంటారు . హిందూ సాంప్రదాయ నమ్మకాల ప్రకారం ఉత్తరాయణం వైపు సూర్యగమనం సాగడం శుభదాయకమ్ . అందుకే దీనిని ఉత్తరాయణ పుణ్య కాలం అంటారు . హిందూ పంచాంగం ప్రకారం ఉత్తరాయణ పుణ్య కాలం మాఘ శుద్ద సప్తమి నుండి ప్రారంబం అవుతుంది . అందుకే అ రోజు సూర్యుడు తన రదాన్ని ఉత్తరం వైపు మల్లిస్తున్న రోజుగా బావిస్తూ "రద సప్తమి " అనే పేరుతొ దినిని పవిత్ర దినం గా బావిస్తారు. దీనినే సూర్య జయంతి గా కూడా వ్యవహరిస్తారు. ఈ రోజు మాఘ శుద్ద సప్తమి అంటే రదసప్తమి. ఈ రోజు నుండి దేశ ప్రజలకు ఉత్తరాయణ పుణ్యకాలం .
మరి మన రాష్ట్రానికి వస్తే పరిస్తితి వేరుగా ఉంది . యాద్రుచ్చికంగా అయినా మనకు టెన్షన్ ల కాలం ఈ రోజునుంచే మొదలయిన్ది. రాష్ట్ర విబజన జరగదెమొనని తెలంగాణా నాయకులకు టెన్షన్ అయితే . రాష్ట్ర విభజన జరుగుదెమొనని సిమా0ద్రా నాయకులకు టెన్షన్ . ఇలా ఇరువైపులా ఈ టెన్షన్ ఉంటుంది . ఆ తర్వాత కూడా తెలుగు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు అన్న నమ్మకం లెదు. మొత్తానికి తెలుగు ప్రజలకు కష్ట కాలమే మరి. పుణ్య కాలం లో కష్టాలు అనేది తెలుగు జాతికి రాజకీయ నాయకులు ప్రసాదించిన వర0. పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు . కాని ఖర్మ కొద్ది నాయకులు అనేది తెలుగు ప్రజలకు అనుభవమవుతుంది .
సూర్య గమనం గురించి క్రింది విడియోలో చూడండి . ఈ రోజు నా పుట్టిన రోజు కూడా . అ వివరాలకు ఈ లింక్ మిద క్లిక్ చెయ్యండి