Showing posts with label దీపావళీ. Show all posts
Showing posts with label దీపావళీ. Show all posts

Sunday, November 3, 2013

నరకాసురుడ్ని చంపబట్టి "నరక చతుర్దశి ",మరి దరాసురుడుని చంపకుండా చేయగలరా "దీపావళీ" !?

                                                               
                                                                  


మా చిన్న తనంలో దీపావళీ పండగ అంటే పిల్ల లందరికి ఎంతో సంబరంగా ఉండేది. పండుగకు అయిదు రోజుల ముందు నుంచే టపాసులు కాలూస్తూ ఆనందించే వారం. వంద రూపాయలకు బుట్టెడు టపాసులు వచ్చేవి. మరి ఈ రోజులో , పండగ వస్తుండంటే పెద్దలు  గుండెలు బేజారు అవుతున్నాయి. టపాసుల దరలు చూసి ఒక విదమైన వైరాగ్యం వస్తుంది వారికి .కమ్మగా పిండివంటలు వండుకుని తినక ఎందుకు అంతంత డబ్బులు పోసి కొని తగలెయ్యడం అని వైరాగ్య జ్ఞానం ప్రదర్శిస్తున్నారు.నిజమే మరి దేనికైనా ఒక పరిమితి ఉంటుంది.  వేల రూపాయలు ఖర్చు చేసినా చిన్న క్యారీ బ్యాగులోకి రాణి ఆ టపాసులు ని తగలేసి పండగ చెయ్యాలంటే మధ్యతరగతి వారికి ఎలా మనసొప్పుతుంది?

   సత్యబామ నరకాసురుడుని చంపింది కాబట్టి "నరక చతుర్దర్శి " వరకు చేసుకుంటున్నారు. ఆ రోజు తలకు పోసుకుని పిండి వంటలు చేసుకుని తిని ఆనందిస్తున్నారు. మరి ఈ   " దరాపతులు" (ప్రభుత్వాలు) ఆ దరాసురులు {అధిక దరలు) ని అదుపు చేయలేరు కాబట్టి దీపావళీ మాత్రం "తుస్ " మనక తప్పటం లేదు.అందుకే ఈ  రోజున ఆ దన లక్ష్మి తల్లి పూజ చేసి ,శాస్త్రానికి నలుగు టపాసులు కాల్చి కూర్చోవడమో, టి.వి.లు చూస్తూ కాలం గడపడమో  జరుగుతుంది.

 కల్కిఖడ్గం బ్లాగు మిత్రులకు , వీక్షకులకు, అగ్రిగ్రేటర్లకు దీపావళీ శుభాకంక్షలతో .....