Showing posts with label కట్నం తీసుకునేవాడు గాడిద. Show all posts
Showing posts with label కట్నం తీసుకునేవాడు గాడిద. Show all posts

Friday, September 9, 2016

కట్నం తీసుకునేవాడు గాడిద అయితె, ఆ గాడిదతొ కాపురం చేసేవారు ఏమవుతారు?

                                                             
                                                          

  సంపాదన  ల కోసం చాన్నల్లు పెట్టి, రేటింగ్ ల కోసం సంచలనలూ స్రుష్టించే తెలుగు చానల్ ఒకటి తానేదో సమాజ ఉద్దరణ కోసం పాటు పడుతున్నట్లు తెగ ఊదర గొట్టేస్తుంది. సదరు చానల్ వారు అరగంట కు ఒక సారి " కట్నం తీసుకునేవాడు గాడిద,కట్నం తీసుకునేవాడు గాడిద" అని అంటుంటే ఎవరూ పెద్దగా పట్టించుకోవటం లేదు. ఎందుకంటే,అన్నీ  గాడిదలు అయిన సమాజంలో ఉండి,  ఆ గాడిదలతోనే సంసారాలు చేస్తున్న వారు  ఉన్న రాష్ట్రంలో "చెవి కోసిన మేకలా" అరగంటకొక సారి ఏడిస్తే ఒరిగేదేమిటి? పబ్లిసిటీ కోసం చీప్  ట్రిక్  లు మాని సమస్యకు పరిష్కారం చెప్ప గలరా? ఆలోచించండి.

  వర కట్నం అనేది దురాచారం. ఇది అందరు అనే మాటే. కాని దానిని అందరు ఆమోదించబట్టే ఇంకా కొన సాగుతుంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు, ఆడ మగ బేదం లేకుండా అందరూ దీని ప్రొత్సా హిస్తున్నారు. గవర్నమెంట్ దీనిని నిషేదించి చాలా కాలమయింది. వారు చెయ్యల్సింది వారు చేసారు. కాని ప్రజలు దానిని పట్టించ్కోవడం లేదు. "కట్నం తీసుకున్న వాడు గాడిద అని ఎవరూ అనుకోవటం లేదు కాని, కట్నం తీసుకోను అంటే వాడి మగతన్నాన్నే శంకించే వారు చాలా మంది ఉన్నారు. మరి ఇటువంటి పరిస్తితుల్లో ఏమి చేయ్యాలి. మన ముందున్నవి రెండే మార్గాలు.

  (1)వరకట్నం ని చట్టబద్దం చేయ్యాలి. దీని వలన ఆడపిల్లకు అన్ని రూపాలలో ఇచ్చిన ఆస్తి పాస్తులను రికార్డ్ చెయ్యటమే కాక, దాని మీద ఆమెకు సంపూర్ణ "స్తీ ధన" హక్కులు కలిగి ఉంటుంది. తల్లి తండ్రుల అనుమతి లేకుండా ఆమె కూడ తనకు, తన పిల్లల్కి తప్ప వేరెవారికి అన్యాక్రాంతం చేసే హక్కు ఉండకుండ చేస్తే మంచిది.

 (2). అసలు వరకట్నం అనేదే లేకుండా ఆడపిల్లకి తల్లితండ్రుల ఆస్తిలో సమాన ఆస్తి హక్కు కల్పించారు కాబట్టి, అందరి పెండ్ల్లిల్లు అయిన మరుక్షణమే ఆమె వాటాను ఆమె పార్టిషన్ కోరుకునే హక్కు కల్పిస్తే, తల్లితండ్రుల ఆస్తిని అంచనా వేసుకుని అల్లుళ్లు పెండ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు. వ్యక్తి ఆస్తిని, స్వార్జితం, పిత్రార్జితం అనే బేదంతో సంబందం లేకుండా ఆడ మగ పిల్లలు అందరికి, ఆస్తిలో హక్కు కల్పించాల్సిందే. కుటుంబ ఆస్తులే తప్పా వ్యక్తి గత ఆస్తులు కు తావు ఉండరాదు. తల్లి తండ్రుల సంరక్షణా బారం పిల్లలు అందరిది.మినిమమ్ సెక్యుర్డ్ ఆస్తిని నిర్ణయించి, అట్టి ఆస్తిని పిల్లలు ఎవరూ, తల్లి తంద్రులు చనిపోయేంత వరకు  అన్యాక్రాంతం చెయ్య రాదు.

          ఆడ, మగా అనే బేదం లేక వారు తమ మేదో పరమైన నైపుణ్యంతో సంపాదనా పరులైతే, పిల్లల హోదాలానుసారం మెఇంట్నెన్స్ కోరే హక్కు తల్లితండ్రులకు ఉండాలి. అమ్టే ఆడ పిల్ల అయినా,మగపిల్లవాడు అయినా సరే,  ఒక కలెక్టర్ తల్లి తండ్రులు ఆ స్తాయిలోనే మెఇంట్నెన్స్ కోరే హక్కు ఉండాలి. ఇదంతా స్తి దనం మీద పురుష పెత్తనం ఖచ్చితంగా తగ్గించడమే కాక స్తి పురుషులని ఇద్దరిని తల్లితండ్రులు సమానంగా చూడడానికి దోహదపడుతుంది.


                                          (8/7/2013 Post Republished)