సంవత్సరం క్రితం వై.కా.పా పార్టీ వారికి ముప్పై పైనే పార్లమెంట్లు సీట్లు వస్తాయని, సర్వే లు తేలిస్తే, ఇప్పుడేమో అది కాస్తా పన్నెండు సీట్లుగా తగ్గి పోయినట్లు ప్రస్తుత సర్వేలు చెపుతున్నాయి. సంబదిత పార్టీ వారి ఆలోచన ఎలా ఉన్నా, సి.బి.ఐ. వారు వేస్తున్న చార్జ్ షీట్లను, అందులోని అభియోగాలను జనం నమ్ముతున్నట్లే కనిపిస్తుంది.
అందుకే ఏ నిర్ణయమైనా ఆవేశంతోనో, వీరాభిమానంతోనో తీసుకోకూడదు. ఆలోచించి తీసుకునే నిర్ణయమే సత్పలితాలను ఇస్తుంది. అసలు ఒక ముఖ్యమంత్రి స్తాయిలో పదవి కావాలనుకున్న వ్యక్తి మీద తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఉన్నపుడు వాటిని సత్వరమే పరిష్కరించడం ఉత్తమం. దాని వలన ప్రజలు ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒక ఉద్యోగి మీద వచ్చిన అవినీతి ఆరోపణల లాగా "జగన్" గారి కేసును పరిగణించకుండా సత్వరమే చార్జ్ షీట్లు దాఖలు చేసి, నేర విచారణ కొన సాగించాలి.
ఒక వేళా అతడు నిర్దోషి అయితే, తక్షణమే విడుదల చేసి, సి.బి,ఐ. ని తగిన నష్టపరిహారం జగన్ కి చెల్లించ వలసిందిగా ఆదేశించ వచ్చు. లేకా అతడు దోషిగా రుజువు అయ్యే పక్షంలో తగిన శిఖ్షలను విదిస్తే, తెలుగు ప్రజలు ఒక నేరస్తున్ని అధికారపీటం మీద కూర్చో పెట్టే పాపం నుండి విముక్తులను చేసిన వారవుతారు.
ఏది ఏమైనా అతని మీద మోపబడిన నేర అభియోగ తివ్రత ద్రుష్ట్యా, జగన్ గారి కేసులను తక్షనమే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.