ఆంద్రుల పౌరుషాగ్నిఅల్లూరి సీతారామ రాజు |
నేడు మే 7 తారీకు. సరిగ్గా ఇదే రోజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగవ సంవత్సరం లో తెల్ల కుక్క మేజర్ గుడాల్ నిరాయుదుడుగా ఉన్న అల్లూరి సీతారామ రాజు గారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి వేసిన రోజు.ఆ నాడు కేవళం ఇరవైయేడేళ్ళ ప్రాయంలోనే తెల్లవాడి పాలనను దిక్కరించడమే కాక, అక్షర జ్ణానం లేని, అమాయక గిరిజనులను అగ్నికణాలుగా మార్చి, తెల్లవాడి గుండేల్లో ఫిరంగులు పేల్చిన శౌర్య శాలి మన అల్లూరి సీతారామ రాజు. యువరక్తం అంటే ఎలా ఉంటుందో, దేశబక్తి చాటడంలో తెలుగువాడు ఏ ప్రాంతం వారికి తీసిపోరని నిరూపించిన దీరుడు మన అల్లూరి. ఆయనను స్మరించడం, ఒడలు పులకరించే ఆయన జీవితచరిత్రను పటనం చెయ్యడం తెలుగువారిగా మన కనీస దర్మం. క్రికెట్లు, సినిమా పిచ్చి, అమ్మాయిల ను వేదించడం లాంటివి
గోల్డెన్ లైఫ్ అనుకునే నేటి యువతరానికి కనీసం "అలూరి సీతారామ రాజు" సినిమా అయినా చూపించండి. మన వూరి వీదిరౌడీల జన్మ దినాలు, వర్దంతులు చేసి తెలుగు జాతిని అవమానం చేసే వారికంటే కనీసం రెండు నిమిషాలు అల్లూరి లాంటి ఆంద్ర పౌరుషాగ్ని తలచుకునేవారి జన్మే దన్యం. అమర్ రహే అల్లూరి!
ఇక పోతే నేటి తరం వారు చూసిన ఇంకొక వ్యక్తి, ఆంద్రుల ఆత్మ గౌరవన్ని చాటి చెప్పిన మహానుబావుడు స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు. ఈయన "ఇందిరే ఇండియా, ఇండియాయే ఇందిర" అనే కాలంలో, రాష్ట్రాంలో ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావాలంటే "ఇందిరమ్మ" దయ ఉండితీరాలి, అంతకు మించి తెలుగువారికి దిక్కే లేదన్న దుర్డశ నుంచి "తెలుగు దేశాన్ని" కాపాడిన రాజకీయ వీరుడు మన నందమూరి తారక రామరావు గారు. ఈ రోజున ఆయన విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టడం, మాన్యులు మన ప్రధాని మరియు ఇతర జాతీయ నాయకులు హాజరు కావడం తెలుగువారికి గర్వకారణం. కాకపోతే చిన్న ట్విస్ట్ ఏమిటంటే, అమరులైన వారిని ఇంకా విపక్ష పార్టీ నాయకుడుగనే బావించి ఇందిరమ్మ కోడలు సోనియా గాందీజీ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం కూడా తెలుగువాడి దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో నిరూపించినట్లయింది.అన్నా ఉన్నా లేకున్నా, కాంగ్రెస్ గుండెలో మాత్రం ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు. అమర్ రహే N.T.R!