మన సాంప్రాదాయ రీతిలో మన ఆడపిల్లలు లంగా ఓణీ, చీర లాంటి వస్త్రదారణలో చదువుకుంటుంటే వారు చదువుకున్న అమ్మాయిలుగా కనిపించరు అని మెజార్టీ తల్లి తండ్రుల అభిప్రాయం. ఈ రోజుల్లో పల్లేటూల్లో ఉండే అమ్మాయిలు కూడా పాషన్ కోసమని పంజాబీ వస్త్రదారణ చేస్తూ ఆదునికంగా కనపడుతున్నారు. బుర్రలో ఉండే మెదడు ఏ మాత్రం మెరుగుపరచుకోలేకపోయినా,వేరే రాష్ట్రాల వారి వస్త్రధారణ ను వీరు ఆదునిక వస్త్రధారణ గా మార్చుకుని తెలుగు రాష్ట్రాన్ని పంజాబ్ రాష్ట్రంగా మార్చి వేసారు మన అమ్మాయిలు. సాంప్రాదాయక వాదులు కూడా పెద్దగా అబ్యంతరం చెప్పటంలేదు.
నేను మొన్న ఒక పనుండి ఒక కాలేజికి వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పుడే కాలేజీ ప్రారంబమవుతుంది అనుకుంటా, రై రై మంటూ మగపిల్లలు, ఆడపిల్లలు తమ బైక్ ల మీద వచ్చేసి బైక్లు పార్క్ చేసీ తమ తమ క్లాసుల వైపు వడి వడిగ వెళిపోతున్నారు. సరే అబ్బాయిలు అంటే ఇంగ్లీష్ వారి గెట్ అప్ మన ట్రెడిషనల్ గా మార్చుకున్నాం కాబట్టి, ఫాంట్ షర్ట్ లో కనపడుతూ వారి వారి ముఖాలు మనకు కనపడుతున్నాయి. కానీ అమ్మాయిలను చూదామంటే అంతా ఒకటే ముసుగుల గెట్ అప్. తమ తమ చున్నీలు కళ్ళు మాత్రం తప్పా తల అంతా చుట్టుకుని కాశ్మీరీ తీవ్ర వాదులు లాగా కనిపిస్తున్నారు. పఈన కాశ్మీరీ, క్రింద పంజాబీ వస్త్రధారణతో నా తెలుగు తల్లులు వెలిగిపోతుంటే, నిజం చెప్పొద్దూ నాకు కోంచం ముచ్చట వేసింది. కానీ అంతలోనే నాలోని తెలుగు బిడ్డ లేచి గాండ్రించడం మొదలు పెట్టాడు " చీ, చీ, ఒక తెలుగు వాడివి అయి ఉండి ఇలా పరాయి రాష్ట్రాల వారి లాగా బురఖా వేసుకుని మన ఆడపిల్లలు తిరుగుతుంటే ముచ్చటపడతావా"?
"ఇందులో తప్పే ముంది? మనం ఏనాడో ఇంగ్లీష్ వాడిని అనుకరిస్తే తప్పు లేదు కానీ ఇప్పుడు మన దేశం లోని ఇతర రాష్ట్రాల వారిని, మన ఆడపిల్లలు అనుకరిస్తే తప్పేమిటి?
" అంటే మన తెలుగు తనం అంతరించి పోవల్సిందేనా?
అబ్బే, అంత డేంజరేమి లేదు. మనకు పదిహేను రోజులకో సారి పండగ వస్తుంది కాబట్టి అప్పుడు మన వస్త్రాలు వేసుకుని మన సంస్క్రుతిని కాపాడితే సరి అన్నాను.
పదిహేను రోజులకొకసారి అంటే ఎప్పుడూ, అమావాస్య కు ఒకసారా" అన్నాడు కచ్చిగా నాలోని తెలుగు బిడ్డ.
అంత కోపమెందుకు రా? అయినా మన వారి పరికిణీ ఓణీ గెట్ అప్ కంటే వారు వేస్తున్న కాశ్మీరీ గెట్ అప్ వల్ల లాభాలు ఎక్కువ" అన్నాను.
"లాభాలా ఏంటవి?
తల చుట్టూ, క్లాత్ కవర్ వల్ల బైక్ డ్రైవ్ చేసేటప్పుడు చెవిలోకి గాని ,ముక్కులోకి , ముఖం మీద కానీ దుమ్ము పడదు. ముఖం చూసి కామెంట్ చేసే పోకీరీ గాళ్ళకు వీరి ముఖాలు కనపడవు కాబట్టి వాళ్లు తెల్ల ముఖాలు వేసుకు చూడటం తప్పా కామెంట్లు చెయ్యరు. అలాగే పిల్లలు ముఖాలు కనపడకుండా తల వంచుకుని నడవాల్సిన పని ఉండదు. తల ఎత్తుకుని నడవడం వలన వారిలో ఆత్మస్తైర్యం పెరుగుతూంది....
స్టాప్.స్టాప్. ఇక ఆపు. ఇంకొక పని చేస్తే వారికి చాలా మేలు జరుగుతుంది అన్నాడు తె.బి. ఎక్కసక్కెంగా.
ఏమిట ది?
వారందరికి తలొక మెచిన్ గన్ ఇస్తే అచ్చం కాశ్మీరీ తీవ్ర వాదులు లాగా ఉండటమే కాక, ట్రెనింగ్ కూడా ఇస్తే తమ వెంట బడి వేదించే మ్రుగాళ్ళను కూడా కాల్చి పారేస్తారుగా! ఆవేశంగా అన్నాడు తె.బి.
నేను ఆలోచనలో పడ్డాను వాడు ఆవేశంగా అన్నా అందులో నిజం ఉందనిపించింది. ప్రతి ఆడపిల్లకి పిస్టల్ లైసెన్స్ లు ఇస్తే ఎలా ఉంటుంది? వారి మీద జరిగే దాడులను వారు అరికట్ట గలరా? ఏమో మరి వారు కూడా తీవ్రవాదులుగా మారితే తప్పా మగవారి అరాచకాలకు అంతం ఉండదేమో! మొత్తానికి మన ఆడపిల్లలు గన్ లెస్ కాశ్మీరి టెర్రరిస్ట్ అవతారాలలో దర్శన మిస్తున్నందుకు నాకు ముచ్చటగనే ఉంది. మరి మీకేమనిపిస్తుంది?