Showing posts with label రాష్ట్ర విభజన బిల్. Show all posts
Showing posts with label రాష్ట్ర విభజన బిల్. Show all posts

Tuesday, February 18, 2014

రాష్ట్ర విభజన బిల్ ని హై కోర్టు ఆపినట్లేనా !?

                                                         



ఇప్పుడే అన్ని చానల్స్ లో ప్రసారం చేస్తున్న దాని ప్రకారం ఆర్టికిల్ 3 మిద హై కోర్టు న్యాయవాది శ్రీ P.V క్రిష్నయ్య గారు వేసిన పిటిషన్ ను ఆంద్ర ప్రదెశ్ కోర్టు వారు ఈ రోజు అడ్మిట్ చేస్తూ , కేంద్ర రాష్ట్ర ప్రబుత్వాలకు నోటిసులు జారి చేసింది అని తెలుస్తుంది . . మరి ఇటువంటి పరిస్తితుల్లో రాష్ట్ర విభజన బిల్ మిద చర్చలు కొనసాగించడం కరెక్టు కాకపొవచ్చు. ఇదంతా చూస్తుంటే ఈ బ్లాగులో ఇంతకూ ముందు టపాలో నేను చెప్పిన కాంగ్రెస్ డ్రామా నిజమేనని రుజువైనట్లే ! దిని మిద ఏమి జరుగబొతు0దో ఇంకా కొన్ని గంటల్లోనే తెలస్తుంది ఆ తర్వాత ఎవరు ఏమి చేసారో ఒక స్పష్టమైన అవగాహన కు రావచ్చు . అంతవరకూ డ్రామాలను చూస్తూ ఉండడమే!
అప్ డేట్ : హై కోర్టు నోటిసుల  జారి విషయం గురించి తర్వాత చానల్స్ ప్రసారం చేయటం మానివేయటం చూస్తుంటే , బహూశా ఇది కూడా అబద్దమేనేమో ! ఏది ఏమైనా పార్లమెంటులో మూజువాణి వోటుతో తెలంగాణా బిల్ పాస్సయిoది.ఈ  దెబ్బతో ఏదో రకంగా తమ ఇన్నాళ్ళ కోరికను తీర్చిన సోనియా గాంది తెలంగాణా ప్రజల పాలిత దేవత గా మారితే , సిమాoద్రాలొ దెయ్యం గా మారింది .బిల్ ఎలాగు రాజ్య సభలో కూడా పాసవుతున్ది కాబట్టి రాష్ట్ర విభజన అయినట్లే!అయిందేదో అయింది ! ఇక సిమాoద్రా వారు కూడా సుప్రీం కోర్టుకు వెళ్ళకుండా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయి కాంగ్రెస్ లాంటి చట్ట ఉల్లంగనలకు పాల్పడే పార్టీలను వారి ప్రాంతంలో మనుగడ లేకుండా చెయ్యడమే వారు చేయగలిగిన వివేకమైన పని. ఇక తెలంగాణా వారు "సంబురాలు " మొదలెట్టేసారు కాబట్టి అంతా హ్యాపిసె !