Showing posts with label బాంచన్ కాల్మొక్త అన్నోడు. Show all posts
Showing posts with label బాంచన్ కాల్మొక్త అన్నోడు. Show all posts

Tuesday, August 13, 2013

ఎదురు తిరిగిన ఉద్యోగి "నిజాం " అయ్యాడు . బాంచన్ కాల్మొక్త అన్నోడు "బానిస " అయ్యాడు!

  
                                                                     
  


  ఇది జరిగిన చరిత్ర . తెలంగాణా గడ్డ సాక్షిగా జరిగిన చరిత్ర . 17 వ శతాబ్ద మలిదశలో ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన వారు "అసప్ జాహి " వంశీయులు ,మొగలుల కొలువులో ఉద్యోగులుగా చేరారు . వారే మొగలులు బలహీనులై తమ రాజ్యాలను పరిరక్షీమ్చుకోలెని  తరుణంలో నిజాం లుగా  స్వతంత్రం ప్రకటించుకుని  హైదరాబాద్ రాష్ట్రానికి నవాబులయ్యారు . అంటే ఇక్కడ వారు సరి అయిన సమయంలో చూపిన తెగువ , దైర్య సాహసాలే వారిని పాలకులుగా చేసింది . కాని స్తానికంగ ఉన్నాప్రజలు  పామరులు కాబట్టి బానిసలు గా మిగిలి పోయారు తప్పా , బారత దేశం లో హైదరాబాద్ కలిసే దాక బంద విముక్తులు కాలేక పోయారు . అలాగే అటు తెల్లవారు సైతం ఈస్ట్ ఇండియా  కంపెనీ ఉద్యోగులుగా వచ్చి,స్తానిక రాజులు మద్య తంపులు పెట్టి, పరిపాలన హస్తగతం చేసుకుని చివరకు భారత దేశాన్ని తమ రాణీ పరిపాలన క్రిందకు  తెచ్చారు . ఇదే మన బానిస మనస్తత్వ ఘన  చరిత్ర. . ఆ తర్వాత మహానీయుల త్యాగ పలితంగా స్వాతంత్ర్యం వచ్చింది . అది వేరే విషయం . 

  ఇక్కడ నేను ప్రస్తావిస్తుంది ఏమిటంటే , ఉద్యోగులలో ఉండే ఆత్మాభిమానం , స్వాతంత్ర కాంక్ష సామాన్య జనంలో కాని , వారిని ఏలే నాయకులలో కాని ఉండవా ? ఇప్పుడు రగులుతున్న సీమాంద్రా ఉద్యమంలో కాని ,పోయినేడు రగిలిన తెలంగాణా ఉద్యమంలో కాని ఉద్యోగులదే ప్రదాన పాత్ర . వారిలో కొంత మంది రాబోయే ఎలెక్షన్లలో పోటి చేసి పాలకులుగా మారనున్నారు . కాని రాజకీయ నాయకులు మాత్రం "అమ్మా ,అమ్మా , "అని డిల్లి అధిష్టానం చుట్టూ తిరుగుతూ ,తెలుగుజాతి పరువును ,అత్మాభిమాన్నాన్ని , ఈ  జాతి గురించి ఏమి తెలియని ఒక "అమ్మ "చేతిలో పెట్టారు . ఆవిడ  గీసిన గీత దాటడానికి ఒంటిమీద బట్టలు తడుపుకునే వారు , ఆమెను ఏమి అనలేక జనాఆగ్రహాన్ని  చూపించి , తమ విన్నపాలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ,బాంచన్ కాల్మొక్త వారసులు .  

 ఇదంతా చూస్తుంటే రానున్న రోజుల్లో అటు ఆంద్రలో ,ఇటు తెలంగాణా లో పౌరుషాన్ని చూపిస్తున్న ఉద్యోగులే నాయకులై తెలుగు సీమ ను ఏలేటట్టు ఉన్నారు . అదే జరిగితే చరిత్ర పునరావృత మయినట్లే . కాక పోతే ఒకటే తేడా !. వారు విదేశియులు , వీరు స్వదేశియులు అంతే.  హట్సాప్ అత్మాభిమాన ఉద్యోగులారా !