సప్తాశ్వవాహనుడు ఏతెంచుతున్న వేళ! |
సప్తాశ్వవాహనుడు ఏతెంచన్ వేళ! |
ప్రయాణంలో మా వాహనం ఆగిపోయిన వేళ! |
నేనూ, నా శ్రీమతి |
మా కుటుంబ సబ్యులతో నేను స్టిలిచ్చిన వేళ |
నేను సకుటుంబ,బందువులతో...... |
రాజా గారు లక్ష్మి గారితో... |
నేను బోర్ కొట్టి బోరింగ్ కొడుతున్న వేళ! |
నేను బోర్ కొట్టి బోరింగ్ కొడుతున్న వేళ!2 |
ఈ చిత్రంలో ఉన్న వెలుగేమిటొ మా కర్దం కావటం లేదు. మా వెహికిల్ పోతున్నఫ్ఫుడు తీసిన చిత్రం ఇది. పై నుండి నల్లని చాయ, ఆ పై వెలుగు ఏదో బూమి మీదకు వస్తున్నట్లు ఉంది. మీరెవరఈనా అదేమిటో చెప్పగలరా? |
మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు కాని నేనైతే రోడ్డు ప్రక్కన ఉన్న "బోరింగ్ పంప్" కొట్టి వ్యాయమం చేసాను.
మేము ఈ మద్య శ్రీ శైలం చూద్దామని సకుటుంబ బందు జన సహితంగా (అంతా కలిసి పదిమందే లెండి} బయలుదేరాము. గుంటూరు లో ఒక ట్రావెల్ వారి టెంపొ ఒకటి మాట్లాడుకుని ఉదయానే బయలుదేరాము. తొమ్మిదింటికల్లా శ్రిశైలంలో ఉండాలని చెపితే పాపం డ్రైవర్ వేగంగా బండిని నడుపుతున్నాడు. త్రిపురాంతకం దాటిన తర్వాత అనుకుంటా , ఉన్నట్లుండి వెనుక టైరులోని గాలి తుస్సుమనేసరికి బండి ఆపి చూద్దుము కదా, కొత్తటైరు వేడెక్కిందో ఏమో, అయిర్ వచ్చి ట్యూబు, టైరు పనికి రాకుండా పోయాయి. చిన్నగా డ్రైవర్ టైర్ మార్చే కార్యక్రమంలో పడ్డాడు. నాకు ఏమి చెయ్యాలో తెలియ రాలేదు. అటు ఇటూ కాసేపు పొటోలు తీసుకున్నాక కాసేపు వ్యాయమం చేద్దామనిపించి చుట్టూ చూస్తే అక్కడే రోడ్డు ప్రక్కనే ఒక బోరింఘ పంపు కనిపించింది. అక్కడకు వెళ్ళి దానిని కొట్టడం మొదలుపెట్టా!అంతలో బండి రడీ అనేసరికి వచ్చి వాహనం లో కూలబడ్డాను.
బోర్ కొట్టిన వేళ బోరింగ్ కొట్టడం ఒక అనుబూతి.