నేను నిన్న ఉదయి కిరణ్ మరణ ఉదంతం గురించి "P.V నరసింహా రావుగారి మరణం ని గుర్తుకు తెచ్చిన "ఉదయి కిరణ్ " ఉదంతం!." అనే టపా పెట్టడం జరిగింది. అందులో " సినిమా మెగా దేవుడుకు పనికి రాని వారెవరైనా సరే వారికి అన్ని రకాల అవకాశాలు కోల్పోవాల్సిందే. దీని గురించి ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధిష్టాన దేవుళ్ళు అంతరంగం ఎరిగి మసలుకునే వారు సినిమా రంగం నిండా ఉన్నారు. ఆ విదంగా ఉదయి కిరణ్ సినిమా రంగం నుండి వెలివేయబడ్డాడు . అదే అతని జీవితం ని నిరాశమయంగా మార్చి వేసింది. క్రమంగా దెప్రెషన్ లోకి వెళ్ళిన ఆత ను చివరకు బలవన్మరణానికి గురిఅయ్యాడు. ఇది చాలా విషాదకరం." అని చెప్పటం జరిగింది. దానికి రుజువుగా ఈ రోజు ఒక న్యూస్ ఐటం చూడడం జరిగింది. అదే పైనున్న చిత్రం
. ఇక పోతే ఉదయి కిరణ్ కి చిరంజీవి గారు అంటే అభిమానమో "ఇంద్ర" పంక్షన్ లో ఉదయి మాట్లాడిన తెలియ చేస్తుంది. ఇంతటి అభిమానాన్ని చూపించిన ఇటువంటి అమాయకుడి మీదనా వీరు పగ బట్టి నట్లు వెంటాడి అతనికి అవకాశాలు రాకుండా చేసింది! పాపం ఉదయి కిరణ్ ! ఎన్ని బాదలు పడ్డావయా! నీ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్దిస్తున్నాను .
ఏది ఏమైనా , నిజానిజాలు ఎలా ఉన్నా ఒకటి మాత్రం నిజం . అమాయకుల ఉసురు పాశుపతాస్త్రం కంటే పవర్ పుల్ . అతని పతనానికి కారకులైన వారు ఎంత గొప్పవారైనా సరే , ఆ ఉసురు కు ఊడ్చుకుపోవటం ఖాయం! ఉదయ కిరణ్ అభిమాన్నాన్ని క్రింది వీడియోలో చూడండి. అలాగే నిన్నటి టపాను ఈ లింక్ ను క్లిక్ చూడవచ్చు . http://kalkiavataar.blogspot.in/2014/01/pv.html