Showing posts with label తనిష్క్ జ్యయలరి దొంగ. Show all posts
Showing posts with label తనిష్క్ జ్యయలరి దొంగ. Show all posts

Monday, January 27, 2014

ఒక్క రాత్రిలో ప్రజా నాయకుడు కి కావాల్సిన అర్హత సంపాదించా నంటున్న "తనిష్క్ జ్యయలరి" దొంగ !

                                                        


అయన పేరు కిరణ్ . ఊరు గుంటూరు జిల్లాలోని ఈపూరు. అయనకి సమాజ సేవ చేయాలన్న తపన ఎక్కువట. అ ఉద్దేశ్యంతోనే తమ గ్రామ సర్పంచిగా పోటి చేద్దామని తన ఆలోచన ఊరి వారికి చెపితే ఊల్లో వారందరూ నవ్వి ఇతనిని పిచ్చోడి క్రింద జమ కట్టారట. దానితో మనస్తాపం చెందిన అతను హైద్రబాద్ కి వచ్చేసి తనంటే ఏమిటో సమజానికి చెప్పాలనుకున్నాడు. కొన్నాళ్ళు బాగా ఆలోచించి నట్లుంది " ప్రజా నాయకుడు" కావాలంటే కావాల్సిన  ప్రాదమిక అర్హత ఏమిటా అని. అలా ఆలోచించగా , ఆలోచించగా ఒక రోజు బుద్దుడికి జ్ణానోదయం అయినట్లు అతనికి జ్ణనోదయం అయింది. ప్రజాసేవకుడు కావాలంటే కోట్లు కొల్లగొట్టగలిగిన గుండె దైర్యం కావాలని అతనికి కలిగిన జ్ణానోదయం. అందుకు తాను సమర్దుడా , కాదా అని చిన్న పరీక్ష తనకు తానే పెట్టుకుని అందులో ఘన విజయం సాదించాడు . ఆ తర్వాత తాను చేసిన పని ద్వారా తనకు ప్రజానాయకుడు అయ్యే అర్హత వచ్చిందని , కాబట్టి తాను చేసిన పనిని బట్టి అయినా తన సమర్దతను గమనించి తనకు "లీడర్" పొస్ట్ ఇవ్వాలని తెలుగు ప్రజలకు సంచలన టి.వీ. ద్వారా విజ్ణప్తి చేస్తున్నాడు.

 ఇంతకీ కి ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? హైద్రాబాద్ లోని పేరెన్నిక గన్న బంగారం షాప్ లలో ఒకటైనా "తనిష్క్ జ్యూవలరీస్ షాప్" లో అర్ద రాత్రి కన్నం వేసి కోట్లు విలువ చేసే బంగారం దొంగతనం చేసాడు. దీనిని  పోలిస్ వారు అంతర్ రాష్త్రీయ దొంగల ముఠా  పని అయి ఉంటుందని చెప్పి, పోలిస్ వారిని బ్రుందాలుగా ఏర్పాటు చేసి వెతకడం  ప్రారంబించారు. మూడు రోజుల తర్వాత సదరు ప్రజాసేవక అభిలాషి కిరణ్  గారు టి.వి.9 చానల్ వారి దగ్గరకు వెళ్ళి తనేలా  ఆ  దొంగతనo  చేసింది, సొము ఎక్కడున్నది పూస గుచ్చినట్లు వివరించారు. దానితో ఎగిరి గంతేసిన సదరు చానల్ వారు "తనిష్క దొంగ మా ముందు సరెండర్ అయ్యాడు. అతనిని పట్టి ఇవ్వడానికి మేమె కారణం" అని ఈ రోజు పొద్దున్నుంచి తమ ఛానల్ లో ఒకటే ఊదరగొట్టడం మొదలు పెట్టారు. అంటే "సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది" అన్నట్లు తను కష్టపడి చేసిన చోరి గురించి, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం గురించి ప్రజలకు చెపుతారని ముందుగా ఫొలిసుల వద్దకు వెళ్ళకుండా టి.వి. 9 వారి వద్దకు వస్తే, దొంగను పట్టించిన ఘనత తమదిగా ప్రసారమo  చేసుకుంటున్నారు.అప్ కోర్స్, దానికి ప్రతి పలంగా దొంగ గారి సద్దుదేశ్యాన్ని గూర్చి కూడా ప్రసారం చేస్తున్నారు అనుకోండి . చివరకు పోలిసులు సరెండర్ అయిన వాడిని అరెస్ట్ చేసి టి.వి9 వారికి క్రుతజ్ణతలు చెప్పారు. 

   మొత్తానికి తన అర్హత నిరూపించుకుని ప్రజల అభిమానం పొంది ప్రజా సేవకుడు కావాలనుకుంటున్న "కిరణ్ ది తీప్" గారిని గుర్తించి ఏ రాజకీయ పార్టీ సీటు ఇస్తుందో వేచి చూడాలి. ఇప్పటికైనా ఈపూరు గ్రామ ప్రజలు అతనిలోని సమర్దతను గుర్తించి , తమ నాయకుడు గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. మరి ఆ ఊరి పేరు అంద్రప్రదేశ్ మొత్తం తెలిసిందంటే కిరణ్ చేసిన ప్రయోగమే కద! ఇంత కంటే సమర్దత ఉన్న నాయకుడు వారికి దొరకడం కష్టమే మరి! జై ప్రజా నాయకా!   దిని గురించి మరిన్ని వివరాలకు క్రింది విడియో చూడండి .