మొత్తానికి ఆదర్శ కమ్మ్యునిస్ట్ వాదం లాగే బౌద్దం కూడ ఆదర్శంలో తప్పా, ఆచరణలో పనికి రాదని తేల్చేసారు బౌద్దులు!. ఒక నాటి హిందూ మతం లోని అనా చారాల విపరీత పోకడలను నిరసిస్తూ, ఒక రాకుమారుడు తనకు కలిగిన సకల ఐశ్వర్యాలను, వదలి సన్యాసిగా మారి ప్రవచించిందే బుద్దత్వం. ఆయన చెప్పిన తత్వం ఇక్కడి ప్రజలనే కాక విదేసీ ప్రజలను విశేషంగా ఆకర్షించి, కొన్ని దేశాలు పూర్తిగా బౌద్దమయం గా మారాయి అమ్టే అది ఆ మహానుబావుడీ వ్యక్తిత్వ ప్రభావం. కాని ఆయన చెప్పిన దాంట్లో మానవ సహజ స్వభావానికి వ్యతిరేకమైన అంశాలు ఉండడం వల్ల, నూటికి నూరు పాళ్ళు బౌద్దం ఆచరణ సాద్యం కాదని తేలిపోయింది.
బుద్దుడైనా, మహావీరుడైన ఈ ఖర్మ భూమి నుండే ప్రభవించారు కాబట్టి, వారు చెప్పినది కూడహిందూ మతం అధారంగా కాబట్టి, అది హిందూ మతం లో బాగమేగానే గుర్తిస్తున్నాం. మన చట్టాల ప్రకారం కూడా హిందూ ఇంక్లూడ్స్ బుద్ధిస్ట్, అండ్ జైన్.కాబట్టి బౌద్దులకు ఎక్కడ ఏమి జరిగినా దానికి మనం కూడ సహజంగానే ప్రతి స్పందిస్తాం. ఈ సహజ బందం వలనే కాబోలు మియన్మార్లో జరుగుతున్న దానికి ప్రతీకారంగా తీవ్రవాదులు మొన్న బుద్దగయలో ప్రతీకారం తీర్చుకున్నారు.
ప్రసిద్ద టైమ్ మాగ్జిన్లో రాసిన దాని ప్రకారం మియన్మార్లోని బొద్దులు అహీంసా మార్గాన్ని వదలి హింసా మార్గం లో నడుస్తున్నారట. అలా నడువమని "విరాత్" అనే బౌద్ద సన్యాసి ప్రచారం మొదలెట్టాడట!. అదంతా ఎందుకంటే తమ మతం ని బంగ్లా దేశ్ నుండి వచ్చే ముస్లిం మత జాలం నుండి కాపాడుకోవాటానికేనట. అక్కడ ముస్లిమ్ లను పెండ్లి చేసుకోవాలంటే, ఆడపిల్లలకు తల్లితండ్రుల అనుమతితో పాటు, మత పెద్దల అనుమతి తప్పనీసరి అట!. ముస్లిమ్ ల పట్ల వ్యతీరేకతే కాకుండా వారి షాపులను, బిజినెస్స్ లను బహిష్కరించమని , అందుకోసం హింసను ప్రయోగించినా తప్పు లేదని ప్రకటించాడట ది గ్రేట్ విరాత్ సన్యాసి గారు.
శబాష్ మొత్తానికి బుద్దులకు జ్ణానోదయం అయింది. అందుకే పరిస్తితులను గమనించి మియన్మార్ లోని బౌద్దులలో "బుద్దుడు" వెళ్ళిపోయి వారిలో కూడా తీవ్రవాది ప్రవేశించాడు. కాబట్టి " బుద్దుడు గయా!తీవ్రవాది ఆయా!". కాకపోతే ఉరుము ఉరిమ్ మంగళం మీద పడిందని మియన్మార్లో జరిపే బుద్దుల దాడికి బారత "బుద్దగయ" లో ప్రతీకారం తీర్చుకోవడం ఏమిటి? అంటే పైన చెప్పిన సమాధానమే.