ఈ మద్య డిల్లీ రేప్ బాదితురాలు పేరు (అసలుది కాదు) మీద స్త్రీ ల రక్షణా పదకాలు ప్రవేశ పెడుతున్నారు. ఆ అబాగ్యురాలి మీద జరిగిన అత్యాచారానికి గుర్తుగానో, లేక అటువంటి వాటిని అరికట్ట లేక పొతున్న మన చేతకాని తనానికి నిదర్శనంగా ఆ పేరు పెడుతున్నారో తెలియదు కాని, ఆ పేరు గుర్తుకువచ్చినప్పుడల్లా యావత్ జాతి మొత్తం సిగ్గుతో తలవంచుకోవలసిందే తప్పా అంతకు మించి మాట్లాడేది ఏమి లేదు. కనీసం ఆ నిర్బాగ్యురాలి వెంట ఉన్న వాడైనా ఆ ముష్కరులతో పోరాడి వీరమరణం పొంది ఉంటే, ఈ దేశంలోని మగవాళ్ళు కొంచం తల యెత్తుకుని ఉండేవారు.
ఈ రోజు పేపర్లో ఒక వార్త చూశాను. చాలా సంతోషం అనిపించింది. మన ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి ఆదునిక పరిజ్ణానం ఉపయోగించి "జస్ట్ వింగ్ ఇంఫర్మేటిక్స్" సంస్త వారు రూపొందించిన " m DEFENCE అనే యాప్ ను మంత్రి గారు ఆవిష్కరించారు. దీ ని వలన స్త్రీ లు విపత్కర పరిస్తితుల్లో, ఒక మొబైల్ బటన్ ప్రెస్స్ చెయ్యడం ద్వారా తమ బందువులను ,పోలిసులను, అలర్ట్ చేయవచ్చట. దీనికి సంబందించిన పూర్తి సమాచారం కొరకు ఈ లింక్http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/06/10/ArticleHtmls/10062013009019.shtml?Mode=1 ని క్లిక్ చెయ్య గలరు.
అంతా బాగానే ఉంది కాని ఈ యాప్ కి అప్ప్లీకేషన్ నిర్బయ అని ఆంద్రజ్యోతి వారు నామకరణం చేసేదానికన్నా "అప్ప్లీకేషన్ టూ శ్రీ క్రిష్ణా " అని పెరు పెడితే బాగుండేమో! ఎందుకంటే ఆ నాడు నిండు సబలో ఒక స్త్రీ మాన మర్యాదలను నాశనం చెస్తుంటే నిలువుగుడ్లు వేసుకుని చూసిన మగవాళ్లందరిని ఇంక్లూడింగ్ హ్హ్బర్తలను అసహ్యహించుకుని, అన్న అయిన శ్రీ క్రిష్ణుని ప్రార్దించింది ద్రౌపది. అబల మాన రక్షణ కన్న అన్య దర్మం ఏది ఉండదని ఆ బగవానుడు చీరలను ప్రసాదించి బారత స్త్రీ మాన గౌరవాన్ని కాపాడాడు. అటువంటి వారిని స్పూర్తిగా తీసుకుని ఈ యాప్ కి ఆ పేరు పెట్టి ఉంటే ఎంతో బాగుండేది అని నా అభిప్రాయం. ఏది ఏమైనా స్త్రీల మాన మర్యాదలు కాపాడే టెక్నాలజి ని ఆ నాడే శ్రీ క్రిష్న బగవానుడు చీరలు ప్రసాదించే సందర్బంలో ఉపయోగించాడు కాబట్టి ఆయనే ఆద్యుడు. అటువంటి టెక్నాలజిలను ఆవిష్కరించే వారసందరికి ఆ బగవంతుని క్రుప కలుగుగాక!