Monday, June 10, 2013

"అప్లికేషన్ నిర్బయ" అని కాదు "అప్పీల్ టూ శ్రీ క్రిష్ణ" అంటే బాగుంటుందేమో!


                                                                           

  ఈ మద్య డిల్లీ రేప్ బాదితురాలు పేరు (అసలుది కాదు) మీద  స్త్రీ ల  రక్షణా పదకాలు  ప్రవేశ పెడుతున్నారు. ఆ అబాగ్యురాలి మీద జరిగిన అత్యాచారానికి గుర్తుగానో, లేక అటువంటి వాటిని  అరికట్ట లేక పొతున్న మన చేతకాని తనానికి నిదర్శనంగా ఆ పేరు పెడుతున్నారో తెలియదు కాని, ఆ పేరు గుర్తుకువచ్చినప్పుడల్లా యావత్ జాతి మొత్తం సిగ్గుతో తలవంచుకోవలసిందే తప్పా అంతకు మించి మాట్లాడేది ఏమి లేదు. కనీసం ఆ నిర్బాగ్యురాలి వెంట ఉన్న వాడైనా ఆ ముష్కరులతో పోరాడి వీరమరణం పొంది ఉంటే,  ఈ దేశంలోని మగవాళ్ళు కొంచం తల యెత్తుకుని ఉండేవారు.
      ఈ రోజు పేపర్లో ఒక వార్త చూశాను. చాలా సంతోషం అనిపించింది. మన ఆడపిల్లల్ని కాపాడుకోవటానికి ఆదునిక పరిజ్ణానం ఉపయోగించి "జస్ట్ వింగ్ ఇంఫర్మేటిక్స్" సంస్త వారు రూపొందించిన " m DEFENCE  అనే యాప్ ను మంత్రి గారు ఆవిష్కరించారు. దీ ని వలన స్త్రీ లు విపత్కర పరిస్తితుల్లో, ఒక మొబైల్ బటన్ ప్రెస్స్ చెయ్యడం ద్వారా తమ బందువులను ,పోలిసులను, అలర్ట్ చేయవచ్చట. దీనికి సంబందించిన పూర్తి సమాచారం కొరకు ఈ లింక్http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2013/06/10/ArticleHtmls/10062013009019.shtml?Mode=1    ని క్లిక్ చెయ్య గలరు. 
    అంతా బాగానే ఉంది కాని ఈ యాప్ కి అప్ప్లీకేషన్ నిర్బయ అని ఆంద్రజ్యోతి వారు నామకరణం చేసేదానికన్నా "అప్ప్లీకేషన్ టూ శ్రీ క్రిష్ణా " అని పెరు పెడితే బాగుండేమో!  ఎందుకంటే ఆ నాడు నిండు సబలో ఒక స్త్రీ  మాన మర్యాదలను నాశనం చెస్తుంటే నిలువుగుడ్లు వేసుకుని చూసిన మగవాళ్లందరిని ఇంక్లూడింగ్  హ్హ్బర్తలను అసహ్యహించుకుని, అన్న అయిన శ్రీ క్రిష్ణుని ప్రార్దించింది ద్రౌపది. అబల మాన రక్షణ కన్న అన్య   దర్మం ఏది ఉండదని ఆ బగవానుడు చీరలను ప్రసాదించి బారత స్త్రీ మాన గౌరవాన్ని కాపాడాడు. అటువంటి వారిని స్పూర్తిగా తీసుకుని ఈ యాప్ కి ఆ పేరు పెట్టి ఉంటే ఎంతో బాగుండేది అని నా అభిప్రాయం. ఏది ఏమైనా  స్త్రీల   మాన మర్యాదలు కాపాడే టెక్నాలజి ని ఆ నాడే శ్రీ క్రిష్న బగవానుడు చీరలు ప్రసాదించే సందర్బంలో ఉపయోగించాడు కాబట్టి ఆయనే ఆద్యుడు. అటువంటి టెక్నాలజిలను ఆవిష్కరించే వారసందరికి ఆ బగవంతుని క్రుప కలుగుగాక!

1 comment:

  1. కనీసం ఆ నిర్బాగ్యురాలి వెంట ఉన్న వాడైనా ఆ ముష్కరులతో పోరాడి వీరమరణం పొంది ఉంటే, ఈ దేశంలోని మగవాళ్ళు కొంచం తల యెత్తుకుని ఉండేవారు.

    మన తలలు మనం ఎత్తుకోవడానికో దించుకోవడానికో ఒక మగాడు ప్రాణాలు కోల్పోయిఉంటే బావుండు అనికోరుకోవడం బాగాలేదండీ. అంతగా కోరుకో దలిస్తే అసలు ఆ సంఘఠనే జరక్కూడదని కోరుకోవచ్చు. కనీసం అతనన్నా ప్రాణాలతో మిగిలాడు. విషాదములో ఓ చిన్న నిట్టూర్పు. ఇక మగవాల్లందరూ తలదించుకోవాల్సిన సంఘఠనేమీ కాదండీ అది, ఓ నలుగురు వెధవలు చేసిన పనికి మగవారంతా తలదించుకోవడం ఏమిటి? మెజారిటీ మగవారు రేపిస్టులు కారు. సమాజం జాగ్రత్త వహించాలని తెలియజేసిన సంఘఠన అది.

    ReplyDelete